
తన మాజీ ప్రియుడు జస్టిన్ బీబర్‌తో సహజీవనం సమయంలో ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’కు గురయ్యానని అన్నారు అమెరికా పాప్ సింగర్ సెలెనా గోమేజ్. తాజాగా సెలెనా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టీన్ బీబర్‌తో బ్రేకప్ తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. బీబర్‌తో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకు సాగడం మీకు కష్టం అనిపించిందా అని అడిగిన ప్రశ్నకు.. ‘అవును.. అనిపించింది. ఇష్టమైన వారితో విడిపోవడం అనేది చాలా బాధకరం. మానసికంగా బాధించే ఆ బాధను మాటల్లో చెప్పలేం. దాని నుంచి బయటపడటం అంత సులువు కాదు. అయితే నేను దీని నుంచి మరింత బలవంతురాలినయ్యాను. అంతే తప్పా దీన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ నేను కూడా కొన్ని భావోద్వేగ దూషణలకు బాధితురాలిననే అనుకుంటున్నాను’ అంటూ సమాధానం ఇచ్చారు.
అదేవిధంగా ‘పరిణతి చెందిన అమ్మాయిగా నేను ఈ విషయం నుంచి బయటపడాలి అనుకున్నాను. జీవితంలో ఎప్పటికీ దీని గురించి బాధపడనంతగా మారాలి అనుకున్నాను. మారాను కూడా. అప్పుడప్పుడు నాకంటే బలవంతులు లేరని గర్వపడుతుంటాను’ అన్నారు. కాగా సెలినా, జస్టిన్ బీబర్‌లు 2011లో ప్రేమలో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. కొంత కాలం హాలీవుడ్‌లో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన వీరిద్దరూ 2018లో విడిపోయారు. ఆ తర్వాత సెలినాకు బ్రేకప్ చేప్పినా కొద్ది రోజులకే బీబర్ టాప్ మోడల్ హేలీ బోల్డ్‌విన్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment