ప్రియురాలితో ఉండగా జస్టిన్ బీబర్ అరెస్ట్!
ప్రియురాలితో ఉండగా జస్టిన్ బీబర్ అరెస్ట్!
Published Wed, Sep 3 2014 2:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
టొరొంటో: వివాస్పద పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ను ఇటీవల కెనెడాలోని టోరంటోలో పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్ల ఫ్రెండ్, పాప్ స్టార్ సెలెనా గోమెజ్ తో డేటింగ్ లో ఉండగా బీబర్ అరెస్ట్ జరిగింది. బీబర్ అరెస్ట్ కావడానికి ఓ వ్యాన్ డ్రైవర్ తో గొడవ పడటమే కారణమైంది.
ఆగస్టు 29 తేదిన స్టాట్ ఫోర్డ్ లో ఓ మినీ వ్యాన్ ను ఢికొట్టడమే కాకుండా డ్రైవర్ చేయి చేసుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆతర్వాత సెప్టెంబర్ 29 తేదిన కోర్టుకు హాజరవుతానని అంగీకరించడంతో స్వంత పూచికత్తుపై విడుదల చేశారు. యాక్సిడెంట్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమేమి కాదని, ఎవరూ గాయపడలేదని బీబర్ తెలిపారు.
Advertisement
Advertisement