‘జలీనా’ అభిమానులకు షాక్‌ | Justin Bieber Engaged To Model Hailey Baldwin | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 9 2018 11:58 AM | Last Updated on Mon, Jul 9 2018 1:10 PM

Justin Bieber Engaged To Model Hailey Baldwin - Sakshi

హుషారెత్తించే పాటలతో పాటు, ప్రేమ వ్యవహారాలతోనూ ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న స్టార్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ వివాహ బంధంలో అడుగుపెట్టడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ మోడల్‌ హేలీ బోల్డ్‌విన్‌తో బీబర్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లుగా అతడి సన్నిహితులు మీడియాకు తెలిపారు. ‘బీబర్‌ జీవితంలో మొదలుకాబోతున్న కొత్త అధ్యాయం గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’  అంటూ బీబర్‌ తండ్రి సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. హేలీ తండ్రి కూడా.. ‘జేబీ, హెచ్‌బీ హృదయపూర్వకంగా కోరుకున్నదే జరుగుతుంది’ అంటూ ట్వీట్‌ చేసి, శుభాకాంక్షలు అంటూ బీబర్‌ తల్లిదండ్రులను ట్యాగ్‌ చేయడంతో ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లుగా తెలుస్తోంది.

జస్టిన్‌ బీబర్‌ ఎంగేజ్‌మెంట్‌ విషయం తెలియగానే ‘జలీనా’ (సెలీనా గోమెజ్‌, జస్టిన్‌ బీబర్‌ జంటకు ఫ్యాన్స్‌ పెట్టుకున్న పేరు) అభిమానులు షాక్‌కు గురయ్యారు. గత కొన్నేళ్లుగా స్టార్‌ సింగర్‌ సెలీనా గోమెజ్‌తో లవ్‌, బ్రేకప్‌లతో వార్తల్లో నిలిచిన జస్టిన్‌ 2017 అక్టోబర్‌లో మళ్లీ ఆమెతో ప్రేమలో పడినట్లు ప్రకటించారు. దీంతో జలీనా అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే 2016లో హేలీతో విడిపోయిన బీబర్‌ ప్రస్తుతం ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని అభిమానులకు స్వీట్‌ షాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం బీబర్‌, హేలీ జంట బహమాస్‌ టూర్‌లో ఉన్నట్లు వాళ్ల సోషల్‌ మీడియా అప్‌డేట్స్‌ చూస్తే తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement