ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది! | Selena Gomez is spotted at Justin Bieber concert | Sakshi
Sakshi News home page

ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది!

Published Thu, Mar 24 2016 8:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది!

ఆ ఫొటోతో మాజీ ప్రియుడి కచేరికి వచ్చింది!

మాజీ ప్రియురాలిని ముద్దాడుతున్న ఫొటోను ఎవరైనా సోషల్‌ మీడియాలో పెడితే.. సహజంగా అది విమర్శలకు దారితీస్తుంది. ఆ మాజీ ప్రియురాలు కూడా సదరు వ్యక్తిపై కోప్పడే అవకాశముంటుంది. కానీ పాప్‌ సంచలనం జస్టిన్ బీబర్‌ కు ఇలాంటి ఫొటోనే బాగా కలిసొచ్చింది.

కొద్దికాలం కిందటే పాప్ చిన్నది సెలెనా గోమెజ్‌తో బీబర్‌కు బ్రేకప్‌ అయింది. ప్రణయబంధంలో చాలాకాలం పీకల్లోతు కూరుకుపోయిన ఈ జంట ఉన్నట్టుండి వేరయింది. దీంతో బీబర్‌ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేస్తుండగా, సెలెనా తన మ్యూజిక్ కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఇటీవల బీబర్‌ ఓ చిలిపి పని చేశాడు.

సెలెనాను తమకంగా పెదవులపై ముద్దాడుతున్న ఓ పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో సెలెనాకు కోపం తెప్పించకపోగా.. అతనిపై తనకున్న ప్రేమను గుర్తుచేసినట్టుంది. అందుకే వెతుక్కుంటూ మరీ సెలెనా బీబర్‌ కన్సర్ట్‌కు వెళ్లింది. బుధవారం రాత్రి లాస్‌ ఏంజిల్స్‌లోని స్టాప్లెస్ సెంటర్‌లో జరిగిన బీబర్ కాన్సర్ట్‌లో సెలెనా దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగింది. ప్రేక్షకుల మాదిరిగా ఓ మూలకు నిలబడి సెలెనా బీబర్‌ కాన్సర్ట్‌ను వీక్షించింది. బీబర్‌ సెలెనాను గుర్తించినప్పటికీ పెద్దగా ఉద్వేగపడలేదు. ఆమె గురించే రాసిన పలు పాటలను బీబర్‌ ఆలకించాడు. అన్నట్టు 2014లో దిగినట్టు భావిస్తున్న ఈ కిస్సింగ్ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 లక్షల లైకులు వచ్చాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement