మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు! | Justin Bieber, Selena Gomez indulge in ugly Twitter spat | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!

Aug 16 2016 10:11 AM | Updated on Sep 4 2017 9:31 AM

మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!

మాజీ ప్రియుడు చాలాసార్లు మోసం చేశాడు!

కొంతకాలం ప్రేమించుకొని.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న యువ పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్- సెలెనా గోమెజ్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది.

కొంతకాలం ప్రేమించుకొని.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్న యువ పాప్ సింగర్స్ జస్టిన్ బీబర్- సెలెనా గోమెజ్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారినట్టు కనిపిస్తోంది. ఈ మాజీ ప్రేమికులు తాజాగా ట్విట్టరెక్కి రచ్చచేశారు. ఒకరినొకరు పబ్లిగ్గా తిట్టిపోసుకున్నారు.

తన కొత్త గర్ల్ ఫ్రెండ్ సోఫియా రీచి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆపకుంటే.. తన అఫీషియల్ పేజీని మూసివేస్తానని ఈ నెల 14న బీబర్ అభిమానులను హెచ్చరించాడు. ఈ పోస్టుపై సెలెనా ఘాటుగా స్పందించింది. 'నువ్వు అభిమానుల నెగిటివ్ వ్యాఖ్యలను భరించలేకపోతే.. నీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను పోస్టు చేయడం మానేయ్. అది మీ ఇద్దరి పర్సనల్ విషయం. అంతేకానీ అభిమానుల మీద వీరంగం వేయకు. వాళ్లు నిన్ను ప్రేమిస్తున్నారు' అని సెలెనా కామెంట్ చేసింది. అనంతరం ఈ కామెంట్ ను తొలగించినప్పటికీ బీబర్ మాత్రం సెలెనా మీద కారాలు మిరియాలు నూరాడు. 'ఒకప్పుడు నన్ను ఉపయోగించుకొని ప్రజల దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు ఇప్పుడు నన్నే వేలెత్తి చూపిస్తున్నారు. ఇది నిజంగా ఫన్నీగా ఉంది' అంటూ సెలెనాను విమర్శించాడు.

దీంతో 'హ్యాండ్స్ టు మై సెల్ఫ్' సింగర్ సెలెనా మళ్లీ కామెంట్ చేసింది. బీబర్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు అతను తనను ఎన్నోసార్లు మోసం చేశాడని పేర్కొంది. అతడి మోసాలను క్షమించి.. మద్దతుగా నిలిచిన తన మీదనే బీబర్ విమర్శలు చేస్తున్నాడని వాపోయింది. అయినా, అభిమానులు అనేవాళ్లు పిచ్చివాళ్లని, ఏం చేసినా అభిమానిస్తూనే ఉంటారని పేర్కొంది. కొంతకాలంపాటు ప్రేమలో మునిగిపోయి.. చాలా సన్నిహితంగా మెలిగిన బీబర్-సెలెనా 2014లో వేరయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement