కిస్సర్ పర్‌ఫెక్ట్! | perfect kisser | Sakshi
Sakshi News home page

కిస్సర్ పర్‌ఫెక్ట్!

Published Tue, Jan 13 2015 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

కిస్సర్ పర్‌ఫెక్ట్!

కిస్సర్ పర్‌ఫెక్ట్!

ఏం కావాలో కోరుకో అనాలే గానీ.. టేస్ట్‌కు హద్దే లేదనిపిస్తుంది మనోడు నిక్ జోనస్‌ను చూస్తుంటే! ఓ రేడియో ఇంటర్వ్యూలో యాంకర్ ఓ ఫన్నీ క్వశ్చన్ అడిగింది... భార్యగా ఎవరిని కోరుకుంటారు... కిస్సింగ్‌కైతే ఎవరికి ఓటేస్తారు... అని. దానికి మూడు ఆప్షన్లు... మిలే సిరస్, డేమీ లోవోటో, సెలెనా గోమేజ్ పేర్లు కూడా ఇచ్చింది సదరు యాంకరు. అడిగిందే తడవుగా ఈ సింగర్ కుర్రాడు ఠక్కున బదులిచ్చేశాడు... సతిగా లోవోటోకు మార్కులేశాడు. ఇక కిస్సర్‌గా సెలెనా సూపరంటూ తెగ ఇదైపోతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీవియా కల్పోతో డేటింగ్ చేస్తున్న నిక్... గతంలో కొంత కాలం డేమీ లోవోటో, సెలెనా గోమేజ్‌లతో జతకట్టి తిరిగాడు. ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే పర్‌ఫెక్ట్‌గా  చెప్పగలిగా అంటూ మురిసిపోయాడు నిక్! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement