పాత గర్ల్ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్ | Bieber posts candid photo with Gomez | Sakshi
Sakshi News home page

పాత గర్ల్ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్

Published Mon, Oct 6 2014 3:41 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

పాత గర్ల్ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్

పాత గర్ల్ఫ్రెండ్ చెంతకు జస్టిన్ బీబర్

ఎప్పటికప్పుడు కలుస్తుండటం, మళ్లీ విడిపోవడం, మళ్లీ కలవడం ఆ జంటకు మామూలే. అలాగే ఇప్పుడు మళ్లీ కలిశారు. తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఓ ఫొటోను జస్టిన్ బీబర్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అందులో బీబర్ భుజాలను ముద్దాడుతున్నట్లుగా సెలెనా కనిపిస్తుంది. ఈ వారం మొదట్లోనే గోమెజ్ వాస్తవానికి జస్టిన్ బీబర్ను ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో చేసింది. ప్యారిస్ నగరంలో కెండల్ జెన్నర్ అనే మోడల్తో కలిసి డేటింగ్కు వెళ్లినప్పుడు అతడు కనపడటంతో ఆమె మండిపడింది.

అయితే, ఇంతలో ఏమైందో గానీ బీబర్ మాత్రం ఉన్నట్టుండి ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. గతవారం వీళ్లిద్దరూ కరేబియన్ దీవులకు ఒక రొమాంటిక్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసుకుని ఉంటారని అంతా భావిస్తున్నారు. ఈ ఫొటోలో బీబర్ నల్లటి వెస్ట్ వేసుకుని, డిజైనర్ సన్గ్లాసులు పెట్టుకుని కనిపిస్తాడు. గోమెజ్ అతడి భుజాల మీద సుతారంగా ముద్దుపెట్టుకుంటున్నట్లు కనపడింది. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ ఇవే దుస్తులతో ఒక ఫొటో దిగినా, ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లోంచి బీబర్ తొలగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement