Bill Gates and Melinda Share Their Newborn Grandchild Pics on Social Media - Sakshi
Sakshi News home page

మనవడితో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్.. ఫోటోలు వైరల్

Published Fri, Apr 7 2023 8:22 PM | Last Updated on Fri, Apr 7 2023 8:39 PM

Bill gates and melinda share their newborn grandchild pics - Sakshi

మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్, అతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ మొదటి మనవడి ఫోటోలను తమ వేరువేరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. జెన్నిఫర్ ఆమె భర్త నేయెల్ నాసర్ 2023 మార్చి 5న ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తమ మొదటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.

జెన్నిఫర్ & నేయెల్ నాసర్ చిన్న పాదాలు ఉన్న ఫోటో షేర్ చేస్తూ మా చిన్న హెల్తీ ఫ్యామిలీ ప్రేమను పంచుతోంది, అంటూ రాసుకొచ్చారు. ఇక బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన మనవడిని చేతుల్లో పట్టుకుని 'ప్రపంచాన్ని కనుగొనడం కోసం నేను వేచి ఉండలేను' అంటూ క్యాప్సన్ ఇచ్చారు.

అదే సమయంలో మెలిండా గేట్స్ మనవడిని చేతుల్లో పట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. నాకు మొదటి మనవడిని పట్టుకోవడంలా అనిపించడం లేదు, నేను జెన్‌ని పట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు జెన్‌, నాయెల్ తల్లిదండ్రులుగా కొత్త పాత్రలో అడుగు పెట్టడం చూసి గర్వపడుతున్నానంటూ రాసింది.

వీరి పోస్టులు చూసిన వారిలో చాలామంది వారికి అభినందనలు తెలిపారు. ఇందులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదలైన వారు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement