మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ.. | Justin Bieber re-follows Selena Gomez on Instagram | Sakshi

మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ..

Jun 8 2016 8:40 AM | Updated on Sep 4 2017 2:00 AM

మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ..

మాజీ ప్రేయసితో ఐవాన్నా ఫాలో.. ఫాలో యూ అంటూ..

తన మాజీ ప్రేయసిని ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి ఫాలో అవుతున్నాడు. ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ఇన్స్టాగ్రమ్లో మరోసారి ఆమె వెంటపడుతున్నాడు.

లండన్: తన మాజీ ప్రేయసిని ప్రముఖ హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి ఫాలో అవుతున్నాడు. ప్రముఖ సామాజిక అనుసంధాన వేధిక ఇన్స్టాగ్రమ్లో మరోసారి ఆమె వెంటపడుతున్నాడు. జస్టిన్ బీబర్కు సెలెనా గోమెజ్ అనే ప్రేయసి ఉన్న విషయం తెలిసిందే. ఆమెతో అతడు 2014 డిసెంబర్లో తెగదెంపులు చేసుకున్నాడు.

దాంతో అప్పుటి నుంచి ఎవరికి వారే మాజీ ప్రేమికులుగా ఉండిపోయారు. ఈ రెండేళ్ల కాలంలో కనీసం వారు ఒకసారి కలుసుకున్నట్లు, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించినట్లుగాని లేదు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ప్రేమికులను ఎప్పటి నుంచో తీక్షణగా చూస్తున్న అభిమానులకు ఒకేసారి బీబర్ షాకిచ్చాడు. ఈ నెల 5 నుంచి తన మాజీ ప్రేమికురాలు సెలెనాను ఫాలో అవడం మొదలుపెట్టాడు. దీంతో ఆ 23 ఏళ్ల అందాల్ పాప్ సింగర్పై బీబర్ కు ఇంకా ప్రేమ తగ్గలేనట్లుందని అతడి అభిమానులు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement