Malayali
-
రోడ్డు ప్రమాదానికి గురైన 'సలార్' విలన్.. నేడు సర్జరీ
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. మరయూర్ బస్టాండ్‌లో ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించి కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నేడు ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'విలాయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా అదే ప్రాంతంలో జరుగుతోంది. ఇకపోతే తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్లో హీరోగా నటించింది ఆయననే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సలార్'లో ఆయన కీ రోల్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!) -
Anna Katharina Valayil: సింగర్ మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా..
అన్న కేథరిన్ వలయిల్ ఇండియాలో పుట్టి నైజీరియాలో పెరిగింది. మళ్లీ వారి కుటుంబం స్వదేశానికి వచ్చింది. కొచ్చిన్‌లో డిగ్రీ పూర్తి చేసింది. సౌత్ ఆస్ట్రేలియాలో మూడు సంవత్సరాల పాటు ఇండిజినస్ మ్యూజిక్‌ను స్టడీ చేసింది. డెబ్యూ మ్యూజిక్ వీడియో ‘హాని బీ’ తనకు మంచి పేరు తెచ్చింది. కేథరిన్ చక్కని సింగర్ మాత్రమే కాదు చక్కని కవయిత్రి కూడా. ‘ఏబీసిడీ’ ‘బెంగళూరు డేస్’ ‘లైలా ఓ లైలా’ సినిమాలలో పాటలు రాసింది. బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కోసం ఒక మ్యూజిక్ వీడియో తయారు చేసి ఇచ్చింది. తన గొంతే కాదు..పాటలు కూడా బాగుంటాయి అని చెప్పడానికి ఈ వాక్యాలు సాక్ష్యంగా నిలుస్తాయి... ‘నాలుగు గోడల ఇల్లే నీ ప్రపంచం కాదు ఈ ప్రపంచమే నీ ఇల్లు పక్షులు ఆకాశంలో స్చేచ్ఛగా విహరించాలని మాత్రమే అనుకుంటాయి అక్కడ ఖరీదైన గూడు ఒకటి కట్టాలనుకోవు!’ చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం.. -
మళయాళీ కవికి ప్రతిష్టాత్మక పురస్కారం
తిరువనంతపురం : సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్ పురస్కారం 2019 ఏడాదికి గాను మళయాల కవి అక్కితంను వరించింది. అక్కితం అసలు పేరు అక్కితం అచ్చుతన్ నంబూద్రి. వీరు ప్రస్తుతం కేరళలోని పాలక్కడ్‌లో నివాసం ఉంటున్నారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గానూ ఈ గౌరవం దక్కింది. దీంతో కేరళ నుంచి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం పొందిన ఆరో వ్యక్తిగా అక్కితం గుర్తింపు పొందారు. ఇంతకుముందు కేరళ నుంచి పురస్కారం సాధించిన వారిలో జి.శంకరకురూప్, ఎస్కే పొట్టక్కడ్, తకజి శివశంకర పిళ్ళై, ఎంటీ వాసుదేవర్ నాయర్, ఓఎన్వీ కురూప్‌లు ఉన్నారు. 93 ఏళ్ల అక్కితం తన జీవితకాలంలో అనేకమైన అద్భుత రచనలు చేశారు. ఇప్పటిదాకా మళయాళంలో 45కు పైగా రచనలు చేశారు. 1952లో వచ్చిన 'కందకావ్య' అతని మొదటి రచనగా పేర్కొంటారు. బలిదర్శనం, అరన్‌గేత్తమ్, నిమీష క్షేత్రం, ఇడింజు పొలింజ లోకమ్, అమృతగాతికలు అక్కితం కవికి బాగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. శ్రీమద్భాగవతాన్ని మళయాళంలో శ్రీ మహాభాగవతం పేరుతో అనువధించారు. కాగా అక్కితం సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దీంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఆయనను వరించాయి. -
మరో వివాదంలో సెన్సార్ బోర్డు..
త్రివేండ్రం: సెన్సార్ బోర్డుపై మరో సినీ పరిశ్రమ యుద్ధం ప్రకటించింది. కథకళి సినిమాకు యూ సర్టిఫికెట్ ను నిరాకరించినందుకు... మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ దర్శకులు, నిర్మాతలు సోమవారం త్రివేండ్రంలోని సీబీఎఫ్‑సీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన యువ దర్శకుడు సజ్జు కన్నానైక్కల్ కథకళి చిత్రానికి దర్శకత్వం వహించారు. చిత్రానికి ప్రాణంలాంటి సన్నివేశాలను బోర్డు అధికారులు కత్తిరించేశారని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిత్ర యూనిట్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, నిబంధనలకు అనుగుణంగానే కథకళి సినిమాను సర్టిఫై చేశామని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కథకళి నిర్మాతల పిటిషన్ స్వీకరించిన హైకోర్టు సీబీఎఫ్ సీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, సినిమా క్లైమాక్స్ లో కథకళి వేషాన్ని వదిలిపెట్టి వ్యక్తి న్యూడ్ గా పరుగెత్తే సీన్ ను తొలగించాలంటూ సీబీఎఫ్ సీ మేకర్స్ కు సూచించింది. దీనిపై స్పందించిన డెరెక్టర్ ఆ సీన్ సినిమాకు సింబాలిక్ రిప్రజెంటేషన్ అని దానిని తీయలేమని వాదిస్తున్నారు. దేశ వ్యతిరేకంగా కానీ, సెక్సువల్ గా కానీ, మహిళలను వేధించడం లాంటి సీన్ లు ఏమి సినిమాలో లేవని.. కేవలం చివరిలో ఒక వ్యక్తి న్యూడ్ గా నడుచుకుంటూ వెళ్తాడని, అది కూడా లాంగ్ షాట్ లో తీశామని సజ్జు తెలిపారు. కానీ, సీబీఎఫ్ సీ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం సమజసం కాదని అన్నారు. కాగా, క్లైమాక్స్, రెండో రీల్ లో బాస్టర్డ్ అనే పదం అక్కడే ఓ వ్యక్తి వస్త్రాలు తీసేసి చితక్కొట్టే సీన్ లను తొలగించాలని బోర్డు తెలిపింది. 83 కట్లు విధించినందుకు ఉడ్తా పంజాబ్ నిర్మాతలు బెంబే హైకోర్టులో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. -
కాసర్ గోడ్ - ఓ మంచి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటి నియోజకవర్గం
కాసర్ గోడ్... కేరళ ఉత్తరాగ్రాన ఉన్న జిల్లా. ఇది అటు కొంకణ తీరానికి, ఇటు కర్నాటకకి దగ్గర్లో ఉండే కేరళ జిల్లా. అందుకే కాసింత కర్నాటకను, కొంచెం కేరళను కలిపి గోవాలో వేసి వేయిస్తే కాసర్గోడ్ జిల్లా తయారవుతుంది. మొత్తం మీద మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాంటిది కాసర్గోడ్. మిగతా చోట రాజకీయ నాయకుడు కావాలంటే ఆకర్షణీయ వ్యక్తిత్వం, నేతృత్వ లక్షణాలు, ప్రజాసేవా భావం, ఆర్ధిక దన్ను వంటి క్వాలిటీలు కావాలి. కాసర్గోడ్లో వీటితో పాటు ఇంకో క్వాలిటీ ఉండి తీరాలి. అప్పుడే రాజకీయులు రాణించగలరు. ఇంతకీ ఆ క్వాలిటీ ఏమిటనే కదా ప్రశ్న! కాసర్గోడ్ జిల్లాలో రాజకీయంగా రాణించాలంటే బోలెడన్ని భాషలు తెలిసుండాలి. ఆ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి ఉండాలి. కాసర్గోడ్ జనాభాలో కనీసం 35 శాతం మంది కన్నడ మాట్లాడతారు. మలయాళ భాషీయులూ చాలా మంది ఉంటారు. ఇవే కాక తుళు, కొంకణి, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడేవారుంటారు. వీటితో పాటు బ్యారీ అనే భాష కూడా వచ్చి ఉండాలి. బ్యారీ అంటే కాస్త అరబిక్, కాస్త మలయాళం, కాస్త కన్నడ కలిపి ముస్లింలు మాట్లాడే భాష.. నాయకుడికి ఈ భాషలన్నీ వచ్చి ఉండాలి. లేదా ఆయా భాషలు మాట్లాడగలిగే దుబాసీలు వెంట ఉంచుకోవాలి. ఇక్కడ ఇలాంటి బహుభాషా ప్రవీణ/లకు భలే డిమాండ్ ఉంటుంది. పోస్టర్లు కూడా పలు భాషల్లో తయారు చేయించక తప్పదు. ఎందుకంటే ఒక వీధి లో తుళు భాషీయులు ఉంటే, పొరుగువీధిలో కొంకణీలు ఉంటారు. ఆ పక్క సందు తిరిగితే కన్నడ బాష వినిపిస్తుంది. మరో సందు మలుపు తిరిగితే చాలు మలయాళీ వినిపిస్తుంది. కొన్ని వీధుల్లో ఉర్దూ వినిపిస్తే, మరికొన్ని చోట్ల బ్యారీ వినిపిస్తుంది. అసలు కాసర్గోడ్ జిల్లాలో చాలా మందికి చాలా భాషలు వచ్చు. అందుకే కాసర్గోడ్ లో కంటెస్ట్ చేయడం అంటే కఠిన పరీక్ష లాంటిదే! ముఖ్యంగా మంజేశ్వరం, మీంచా, మంగళ్ వాడీ, కుంబాలా, పుదిగే, కుంబాడజే, కరాదుక్క, ఎన్మాకజే, మదియాదుక్క, బెల్లూరు వంటి గ్రామ పంచాయతీల్లో 'జిహ్వకోభాష, వీధికో కల్చర్' విలసిల్లుతూ ఉంటుంది. అన్నిటికన్నా స్పెషల్ విషయం ఏమిటంటే ఈ పలు భాషలు, పలు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఉండదు. రాజకీయులు సైతం ఇప్పటి వరకూ 'విభజించి పాలించే' విధానాన్ని అమలు చేయలేదు. ఏ కూరకు ఆ కూర వేరు చేస్తే ఎవరికీ సరిపోదు. అన్ని కూరల్నీ కలిపి మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ చేస్తే తప్ప ఉపయోగం ఉండదు. అందుకే కాసర్ గోడ్ రాజకీయులు కూడా 'విభజించు- పాలించు' కంటే 'కలిపి ఉంచు - పాలించు' విధానమే మంచిదని భావిస్తారు. అదీ కాసర్గోడ్ అసలు ప్రత్యేకత!! -
మన దీపిక... యంగెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ అమెరికా
ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన అమ్మాయి. పుట్టిందీ, పెరిగింది అమెరికాలో. ఒకసారి సెలవుల్లో తొలిసారి భారతదేశానికి వచ్చింది. సహజంగానే ఇక్కడివారి జీవనశైలిని చూసి చాలా ఆశ్చర్య పోయింది. ప్రత్యేకించి భారతీయులు ప్యూరిఫై చేయని నీళ్లను తాగుతున్నారనే విషయం ఆమెలో ఆందోళన రేపింది. ఆ ఆందోళనే ఓ కొత్త ఆవిష్కరణకు దారి తీసింది. అదే ఆమెకు ‘యంగెస్ట్ సైంటిస్ట్’ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆమె పేరు దీపికా కురుప్. అమెరికాలో సెటిలైన మలయాళీ కుటుంబానికి చెందిన దీపిక అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు ఒక బహుమతిని ఇచ్చింది. అదేంటంటే... సైన్స్‌ను చదువుకొని అర్థం చేసుకోవడ ఒక ఎత్తయితే సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల పరిష్కారానికి దాన్ని అన్వయించుకొని కొత్త ఆవిష్కరణలు చేయడం మరో ఎత్తు. శాస్త్రవేత్తల గురించి అందరూ చదువుకొంటారు. కానీ తామే శాస్త్రవేత్తలమవాలన్న తపన కొందరు టీనేజర్లలోనే ఉంటుంది. అలాంటి తపనే తనను నూతనావిష్కరణలు చేసే స్ఫూర్తిని జనింపజేసిందని చెబుతుంది దీపిక. ఎక్కడో అమెరికాలోని హైస్కూల్లో చదువుతూ భారతదేశంలోని సామాజిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది ఈ పదహారేళ్ల అమ్మాయి. దీపిక తల్లిదండ్రులది తిరువనంతపురం. వారు చాలా సంవత్సరాల కిందటే అమెరికాకు వెళ్లారు. దీపిక అక్కడే పుట్టి పెరిగింది. అమెరికాలోని లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిపోయిన ఈ అమ్మాయి పన్నెండేళ్ల వయసులో తొలిసారి ఇండియాకు వచ్చింది. ఇక్కడ తన ఈడు పిల్లలంతా కలుషిత నీరు తాగుతుండటాన్ని గమనించింది. పల్లెల్లో చెరువుల నుంచి, బావుల నుంచి తెచ్చుకొన్న నీళ్లను అలాగే సేవిస్తారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది. అది చాలా ప్రమాదకరమని, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ విషయం గురించి అవగాహన ఉన్నా తమకు అంతకు మంచి, మరో ప్రత్యామ్నాయం లేదని స్థానికులు దీపికకు తెలియజెప్పారు. అటువంటి నేపథ్యంలో వారి పరిస్థితిలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం చేయాలనుకొంది. అయితే ఇక్కడి ప్రజలందరికీ వాటర్ ప్యూరిఫయర్లు కొనివ్వడం తనకు సాధ్యం కాదు, సొంతంగా కొనుక్కోవడానికి వారి శక్తీ చాలదు. మరి చౌకధరలో వాటర్ ప్యూరిఫయర్లు అందుబాటులోకి తీసుకొస్తే... అవి కూడా కరెంట్, గ్యాస్‌ల వంటి ఇంధనాల అవసరం లేకుండా సహజంగానే పనిచేస్తే... అప్పుడు సమస్య చాలా వరకూ పరిష్కృతం అయినట్టేనని దీపిక భావించింది. ఇదే ఐడియాతో ఆమె ‘సోలార్ వాటర్ ప్యూరిఫయర్’ను రూపొందించింది. ప్రయత్నం ప్రశంసలు పొందింది... సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా వాటర్ ప్యూరిఫయర్‌కు రూపకల్పన చేసిన దీపికకు ‘డిస్కవరీ ఎడ్యుకేషన్ త్రీఎమ్ యంగ్‌సైంటిస్ట్’ పోటీలు లాంచింగ్ ప్యాడ్‌గా నిలిచాయి. అనేకమంది యువతీయువకులు తమ సైంటిఫిక్ ఐడియాతో ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు. వారందరి మధ్య దీపిక ఆవిష్కరణ భిన్నమైనదిగా నిలిచింది. ప్రత్యేకించి పేదప్రజలకు ప్యూరిఫైడ్ వాటర్ అందించాలనే ఆలోచనతో దీపిక చేసిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ తోబాటు ఆమె చేసిన ఆవిష్కరణ కూడా విజయవంతం కావడంతో ‘అమెరికన్ యంగ్ సైంటిస్ట్’ అవార్డు దక్కింది. ప్రైజ్‌మనీనే పెట్టుబడిగా... దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఆ సొమ్మునే సోలార్‌వాటర్ ప్యూరిఫయర్ల రూపకల్పనకు పెట్టుబడిగా చేసుకోవాలని దీపిక భావిస్తోంది. ఈ విషయంలో పరిశ్రమల నుంచి కూడా ఆమెకు సహకారం లభిస్తోంది. దీంతో త్వరలోనే దీపిక రూపొందించిన సోలార్ వాటర్ ప్యూరిఫయర్లు మార్కెట్లో సందడి చేసే అవకాశం ఉంది. దీపికకు రెండు రకాలుగా మంచి గుర్తింపు లభించింది. ఒకటి ఆవిష్కరణ ద్వారానైతే, రెండోది గ్రామీణ భారతంలోని నీటి సమస్య గురించి పరిశీలన చేసి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం ద్వారా. ఈ ఆవిష్కరణ విషయంలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది.