
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురయ్యారు. మరయూర్ బస్టాండ్‌లో ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సినిమాకు సంబంధించి కొన్ని భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా.. ఆయనకు ప్రమాదం జరిగింది. KSRTC బస్సులో ఓ ఫైట్ సీన్‌ను షూట్ చేస్తుండగా ఆయన జారి కిందపడ్డాడు. దీంతో ఆయన కాలికి గాయం అయింది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నేడు ఆయనకు ఆపరేషన్ చేయనున్నారు. ఈ ఆపరేషన్ తరువాత పృథ్వీరాజ్ సుమారు మూడు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
(ఇదీ చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి)
మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'విలాయత్ బుద్ధ'. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా అదే ప్రాంతంలో జరుగుతోంది. ఇకపోతే తెలుగువారికి కూడా పృథ్వీరాజ్ సుపరిచితమే. పవన్, రానా నటించిన భీమ్లా నాయక్ ఒరిజినల్ వెర్షన్‌లో హీరోగా నటించింది ఆయననే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'సలార్'లో ఆయన కీ రోల్ విలన్ పాత్రలో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
(ఇదీ చదవండి: పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!)