ఊహించలేరట.. ఎవరూ ఊహించలేరట. ‘ఒక్క క్షణం’ స్క్రీన్‌ప్లేని సినిమా చూస్తున్నప్పుడు ఎవరూ ఊహించలేరట. ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత అల్లు శిరీష్ హీరోగా సురభి హీరోయిన్‌గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇది. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 28న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో రెండు జంటల మధ్య జరిగే సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మొదటి రీల్ నుంచి చివరి రీల్ వరకు ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతారు’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రం ప్యారలల్ లైఫ్‌తో ముడిపడి ఉంటుంది. ఒక జంటది ప్రజెంట్, మరొకరిది ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎవ్వరూ ఊహించలేని స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని అన్నారు. కాశీ విశ్వనాథ్, రోహిణి, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: అబ్బూరి రవి, కో–ప్రొడ్యూసర్స్: సతీష్ వేగేశ్న, రాజేష్ దండ.
Comments
Please login to add a commentAdd a comment