‘‘ఒక్కక్షణం’ సినిమాకి వస్తున్న ఫీడ్‌బ్యాక్, రెస్పాన్స్‌తో హ్యాపీగా ఉన్నా. ప్రత్యేకించి ఈ సినిమాలోని కథతో పాటు హీరో గురించి మాట్లాడుతున్నారు. ఓ యాక్టర్‌గా అది నాకు బాగా అనిపించింది. గత సినిమాలకంటే ఈ సినిమాలో నటుడిగా ఎదిగావు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయంటుంటే వెరీ హ్యాపీ’’ అని హీరో అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన ‘ఒక్కక్షణం’ ఈ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు.
► ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడా. ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నప్పుడు ఆనంద్ ‘ఒక్కక్షణం’ కథ తీసుకొచ్చారు. తను కథ చెప్పిన విధానం నచ్చి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత నాన్నగారు (అల్లు అరవింద్) కథ విని బాగుందన్నారు. అన్నయ్యకి (అల్లు అర్జున్) స్టోరీ లైన్ తెలుసు. కథ పూర్తిగా తెలీదు. ఫస్ట్ కాపీ చూసి బాగుందన్నారు.
► ‘ఒక్కక్షణం’ ప్రాజెక్ట్ కొంచెం ఆలస్యమైంది. అయితే సినిమాపై నమ్మకంతో వేరే ఏ సినిమా నేను ఒప్పుకోలేదు. ప్యారలల్ లైఫ్ పాయింట్ కొత్తగా అనిపించింది. కథను నేను బాగా నమ్మడంతో ఇన్‌వాల్వ్ అయి చేశా. కథకి అవసరం మేరకే మూడు ఫైట్స్ ఉన్నాయి. అవి అనవసరం అనిపించవు.
► ఆనంద్ చెప్పిన కథని అంతే చక్కగా తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత ఆయనపై నాకు మరింత గౌరవం పెరిగింది. అమ్మ సెంటిమెంట్ సీన్‌కి చాలామంది కనెక్ట్ అయ్యారు. కెమెరామ్యాన్ శ్యాం కె.నాయుడుతో పనిచేయాలనే నా కోరిక ఈ చిత్రంతో తీరింది. మరో సినిమాకి ఆయనతో పనిచేయనున్నా. ఈ చిత్రంలో సంగీతం కంటే నేపథ్య సంగీతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మణిశర్మగారు చాలా బాగా చేశారు. ఆయనలా ఎవరూ చేయలేరు.
► ప్రమోషన్ సాంగ్‌ను ఇంటర్వెల్ తర్వాత పెట్టాలని షూట్ చేశాం. లెంత్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. ఎండింగ్ టైటిల్స్ అప్పుడు ఆ పాట ఉంటుంది. కొన్ని కామెడీ సన్నివేశాలు తీసేశాం.
► లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలంటే ఇష్టం. అన్నీ అటువంటివే చేయాలని కాదు. నా పాత్ర కొత్తగా ఉండాలి. వైవిధ్యమైన సినిమాలు చేస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది.
► మంచి పాత్ర అయితే వేరే హీరోల సినిమాలో చేయడానికి రెడీ. నా సినిమాలో ఏ హీరో చేయడానికైనా అభ్యంతరం లేదు. మల్టీస్టారర్ మూవీ కథలను రచయితలు రాయడం లేదు. మలయాళంలో ‘1971’ సినిమాలో మోహన్‌లాల్‌గారితో కలిసి నటించడం మరచిపోలేను. ‘ఒక్కక్షణం’ మలయాళంలో డబ్బింగ్ చేయడానికి అక్కడివారు ముందుకొచ్చారు.
► ఓ నిర్మాత కొడుకుగా అది కావాలి.. ఇది కావాలి.. అంటూ నేను నిర్మాతలను డిమాండ్ చేయను. ప్రాజెక్ట్‌పై ఎంత శ్రద్ధ ఉంటుందో పబ్లిసిటీ, డిస్ట్రిబ్యూషన్‌పైనా అంతే శ్రద్ధ పెట్టమని చెబుతానంతే.
► నాన్నగారు వేరే హీరోతో హిట్ సాధించారంటే ఓ కొడుకుగా సంతోషిస్తా. అదే నేను హీరోగా చేసిన సినిమా హిట్ అయిందంటే నాకు మరో పది రెట్లు సంతోషంగా ఉంటుంది (నవ్వుతూ).
► కొత్త డైరెక్టర్లతో పనిచేయాలనే ఎగై్జట్‌మెంట్ ఉంది. ఇప్పుడొస్తున్న మంచి సినిమాలన్నీ కొత్తవారి నుంచి వస్తున్నవే. ఆనంద్ ఓ కొత్త డైరెక్టర్‌లా కష్టపడ్డాడు. అంత కసి ఉన్నవాళ్లతో పనిచేస్తుంటే ఎనర్జీ వస్తుంది. కొత్త, పాత డైరెక్టర్లు చెప్పిన రెండు మూడు కథలు విన్నా. నెలలోపు ఫైనలైజ్ చేస్తా. నేను క్రమశిక్షణతో పనిచేస్తా. కొత్త ఏడాది నుంచి మరింత క్రమశిక్షణగా పనిచేయాలనుకుంటున్నా.
కసి ఉన్నవాళ్లతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది
Published Sat, Dec 30 2017 5:19 AM | Last Updated on Sat, Dec 30 2017 5:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment