Actor Allu Sirish New Movie Teaser Release Date Announced - Sakshi
Sakshi News home page

Allu Shirish: అల్లు శిరీష్ కొత్త సినిమా 'ఊర్వశివో రాక్షసివో'.. టీజర్ డేట్ ఫిక్స్

Published Mon, Sep 26 2022 3:59 PM | Last Updated on Mon, Sep 26 2022 5:14 PM

Actor Allu Shirish New Movie Teaser Release Date Announced  - Sakshi

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది చిత్రబృందం. ఈ మూవీకి 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.  ఈ సినిమా టీజర్‌ను ఈనెల 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర యూనిట్.

(చదవండి: అల్లు శిరీష్ కొత్త చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌)

టైటిల్‌ పోస్టర్‌లో అల్లు శిరీష్ – అను ఇమ్మానియేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్రం రొమాంటిక్ కథ అని తెలుస్తోంది. నవంబర్ 4న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాకేష్ శశి దర్శకత్వం వహిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. శీరీష్‌ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన శీరీష్‌.. తాజాగా ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement