
తండ్రి బడా నిర్మాత, అన్న స్టార్ హీరో అయినప్పటీకీ సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు అల్లు శిరీష్. ఫలితాల విషయం పక్కన పెడితే, వైవిధ్యమైన కథలు కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. అవార్డు ఫంక్షన్లకు తనదైన శైలీలో హోస్టింగ్ చేసి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఒక నటుడిగా ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఎన్ని విధాలుగా ప్రయోగాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు.
ఇక కరోనా లాక్‌డౌన్‌తో షూటింగ్‌లకి బ్రేక్ పడడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు ఈ అల్లు హీరో. ఈ యంగ్ హీరో ఇటీవల తన బరువును తగ్గించి, స్లిమ్, ఫిట్ లుక్ లో అద్భుతంగా కనిపించాడు. అల్లు శిరీష్ జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం తీసుకున్న మిర్రర్ సెల్ఫీలో సిక్స్ ప్యాక్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.అల్లు శిరీష్ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరగా 2019లో ABCD అనే ఒక సినిమాతో వచ్చిన శిరీష్ గత ఏడాది ఖాళీగానే ఉన్నాడు. ఆ మధ్య బాలీవుడ్‌లో ‘విలయాటి షరాబి’మ్యూజిక్ ఆల్భమ్‌లో నటించాడు. ప్రస్తుతం కొత్త కథలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం వాటిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment