Actress Anu Immanuel Responds On Dating Rumours With Allu Sirish, Deets Inside - Sakshi
Sakshi News home page

Anu Immanuel: అల్లు శిరీష్‌తో డేటింగ్ వార్తలు.. మా అమ్మ చాలా బాధపడింది: అను

Published Sat, Nov 5 2022 3:58 PM | Last Updated on Sat, Nov 5 2022 6:10 PM

Actress Anu Immanuel Responds On Dating Rumours With Allu Shirish - Sakshi

మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల ఈ భామ అల్లు శిరీష్‌తో డేటింగ్‌లో ఉందంటూ వార్తలొచ్చినా సంగతి తెలిసిందే. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్‌ నడిచింది. తాజాగా ఈ వార్తలపై అను ఇమ్మానియేల్ స్పందించారు. 

(చదవండి: అల్లు అరవింద్‌ అలా అడిగేసరికి షాక్‌ అయ్యాను : అను ఇమ్మానుయేల్‌)

అను మాట్లాడుతూ.. 'అందులో ఎలాంటి నిజం లేదు. నటీనటులపై ఇలాంటి వార్తలు రావడం సహజం. ఇలాంటి అసత్య ప్రచారాలను నేను పట్టించుకోను. ఈ వార్తలు చదివి మా అమ్మ చాలా బాధపడింది' అని తెలిపింది. అను ఇమ్మానియేల్, అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. యువతను ఆకర్షించేలా ప్రేమ, సహజీవనం అంశాలతో ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదలైన నాటి నుంచి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వరుస వార్తలు వైరలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement