పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ బాబాయ్‌ : అల్లు అయాన్‌ | Viral: Allu Ayaan Funny Conversation With Apple Siri | Sakshi
Sakshi News home page

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ బాబాయ్‌ : అల్లు అయాన్‌

Jun 7 2020 5:58 PM | Updated on Mar 21 2024 4:31 PM

షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే మన సినీ తారలు లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోకుండా వచ్చిన ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం​ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్‌ మీడియా వేదికగా మాత్రం ఫ్యాన్స్‌కు చేరువగానే ఉంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌లు తమ పిల్లలతో ఎంజాయ్‌ చేస్తున్నారు. తమ పిల్లలతో కలిసి చేసిన ఫన్‌ వీడియోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 

తాజాగా అల్లు అర్జున్‌ సతీమని స్నేహారెడ్డి, అయాన్‌, అల్లు అర్జున్‌కి సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అల్లు అయాన్ తన బాబాయ్ శిరీష్ పెళ్లి గురించి ఆపిల్ శిరిని అడగటంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులో అల్లు అర్జున్ త‌న‌యుడు అయాన్‌ త‌న తండ్రి పెట్టుకున్న యాపిల్ వాచ్‌తో సంభాషిస్తూ..మీ పేరేమిటి అని అడుగుతాడు. అవతల నుంచి సిరి అని సమాధానం వస్తుంది. నువ్వు మా బాబాయ్‌వా అని ప్రశ్నించగా.. మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అవతల నుంచి సమాధానం వచ్చింది. బాబాయ్ అంటే అంకుల్ అని, మీ పెళ్లెప్పుడు అని యాపిల్ సిరిని అడుగుతాడు. ఈ వీడియోకి ‘ఆపిల్ శిరీ మ‌రియు అల్లు శిరీ ద‌గ్గ‌ర ఆన్స‌ర్ లేదు’అంటూ కామెంట్‌ పెడుతూ.. స్నేహారెడ్డి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అయాన్‌.. త‌న బాబాయ్ అనుకొని జ‌రిపిన సంభాష‌ణ నెటిజ‌న్స్‌తో పాటు బ‌న్నీ ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement