ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను | Prabhas admiration can not forget - Surabhi | Sakshi
Sakshi News home page

ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను

Published Tue, Jan 12 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను

ప్రభాస్ ప్రశంస మర్చిపోలేను

‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మనసిచ్చిన రాణి ఎలా ఉంటుంది? అందానికి ఆధార్ కార్డ్‌లా ఉంటుంది. పేరు అమూల్య.  మరి సెలైంటా అంటే కాదు తేడా వస్తే ఇరగదీస్తుంది కూడా. అందుకే తనను ఏడిపించాలని చూసిన కొంత మందిని ఓ మార్కెట్‌లో అందరి ముందూ చితక్కొట్టేస్తుంది. అదే అమూల్య ఇంట్రడక్షన్ సీన్’’ అని కథానాయిక సురభి అంటున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఈ గురువారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ  సందర్భంగా ఆమె చెప్పిన సినిమా విశేషాలు...!
 
తెలుగులో నా మొదటి సినిమా ‘బీరువా’. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఎటాక్’ కూడా చేశాను. కానీ ఇది ముందు రిలీజ్ అవుతోంది కాబట్టి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నా రెండో సినిమా. ఈ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లాను. లక్కీలీ అమూల్య పాత్ర నాకే రాసి పెట్టి ఉందేమో అందుకే నన్నే వరించింది.
 
ఇక శర్వానంద్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ‘జర్నీ’, ‘మళ్లీ మళ్లీ ఇది  రాని రోజు’ లాంటి చిత్రాల్లో  ఆయన యాక్టింగ్‌కు నేను ఫ్యాన్‌ను. పైగా సినిమాలో మా జంట ప్రేక్షకులకు  ఫ్రెష్ ఫీల్ కలిగిస్తుంది.
 
ఇప్పటివరకూ నేను కాస్త హోమ్లీ పాత్రలే చేశాను. నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయగలగాలి. ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్, శర్వానంద్  యాక్షన్, మేర్లపాక గాంధీ డెరైక్షన్ అన్నీ ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా కుదిరాయి. అందరం కష్టపడి ఈ సినిమా కోసం పనిచేశాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
 
నేను ప్రభాస్‌గారికి పెద్ద అభిమానిని. ఈ సినిమాలోని ‘కలర్ ఫుల్ చిలకా’ పాటలో బాగున్నానని చెప్పిన ప్రశంస మర్చిపోలేను. త్వరలో రానున్న ఎటాక్‌లో కూడా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నాకు మంచి రోల్ ఇచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కార్ మెకానిక్ రోల్ చేశాను. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో నాని సరసన నటిస్తున్నాను. తమిళంలో జై హీరోగా ఓ సినిమాలో నటించాను. విడుదలకు సిద్ధంగా ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement