
టాలీవుడ్ రెబల్ స్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడిపై మన హీరోలంతా ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ యంగ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభాస్‌పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు.. సినీ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు లేఖ రాశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల్లో, అభిమానులలో చాలా మంది మనోభావాలను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు.
తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా చేరిపోయారు. ఒక నటుడు మరో నటుడిని విమర్శించడని.. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రాథమిక విలువల్లో ఒకటని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ప్రభాస్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.
An actor should never criticize another actor. It’s a basic ethic.
— Sharwanand (@ImSharwanand) August 23, 2024