ప్రభాస్ వచ్చారు.. హిట్ గ్యారంటీ! | Prabhas at Sharwanand's Express Raja audio launch | Sakshi
Sakshi News home page

ప్రభాస్ వచ్చారు.. హిట్ గ్యారంటీ!

Published Mon, Dec 21 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

ప్రభాస్ వచ్చారు.. హిట్ గ్యారంటీ!

ప్రభాస్ వచ్చారు.. హిట్ గ్యారంటీ!

 - శర్వానంద్
 ‘‘దర్శకుడు గాంధీకి చాలా క్లారిటీ ఉంది. ఒక్క షాట్ కూడా ఎక్కువగా తీయలేదని నిర్మాతలు ప్రమోద్, వంశీలు చెప్పారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ప్రభాస్ అన్నారు. శర్వానంద్, సురభి జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రమోద్, వంశీలు నిర్మించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ప్రవీణ్ లక్కరాజు స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో హీరో ప్రభాస్ ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ-‘‘ ‘రన్ రాజా రన్’కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభాస్. ఇప్పుడీ సినిమా ఆడియో ఫంక్షన్‌కి కూడా వచ్చారు. కచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో కథే హీరో. కథతో ట్రావెల్ అయ్యే సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ బాగుంటుంది’’ అని చెప్పారు.  ‘‘యూవీ క్రియేషన్స్ అంటే  ప్రభాస్ బినామీ బ్యానర్ (నవ్వుతూ). శర్వానంద్‌ని నేనే ఓ డెరైక్టర్‌కు ఇంట్రడ్యూస్ చేశాను. అతను నాకు ఇంకా సినిమా చేయలేదు.
 
 వంశీ, ప్రమోద్‌లను చూసి నేను సినిమాలు తీయడం నేర్చుకోవాలి. కొత్త కాన్సెప్ట్‌లు ఎంచుకుంటున్నారు. మేమే ఇంకా మూస ధోరణిలో ఉన్నాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. మారుతి మట్లాడుతూ- ‘‘నేను రీసెంట్‌గా ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ  బాగా కుదిరింది. తప్పకుండా హిట్ అవుతుంది’’ అని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాతలు ప్రమోద్, వంశీ, బన్నీ వాసు, కథానాయిక సురభి, నటులు బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement