'ఒక్క క్షణం' ఫస్ట్ లుక్ | Allu Sirish Okka Kshanam First look | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 29 2017 11:10 AM | Last Updated on Wed, Nov 29 2017 11:15 AM

Allu Sirish Okka Kshanam First look - Sakshi

గౌరవం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అల్లూ వారబ్బాయి శిరీష్, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో అతిథి పాత్రలో మాలీవుడ్ కు కూడా పరిచయం అయిన ఈ యంగ్ హీరో త్వరలో ఒక్క క్షణం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది.

లవ్ వర్సెస్ డెస్టినీ అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సీరత్ కపూర్ మరో కథానాయిక నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement