త్రిష అవుట్ - సురభి ఇన్ | Surabhi replaces Trisha in Jai film? | Sakshi
Sakshi News home page

త్రిష అవుట్ - సురభి ఇన్

Published Sun, Nov 23 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

త్రిష అవుట్  - సురభి ఇన్

త్రిష అవుట్ - సురభి ఇన్

జయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో త్రిష హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలైంది. ఇలాంటి పరిస్థితిలో ఆ చిత్రం నుంచి హీరోయిన్‌గా త్రిషను తొలగించి ఇవన్‌వేరే మాదిరి చిత్రం ఫేమ్ సురభిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కారణం త్రిష వివాహ నిశ్చితార్థమేనన్నట్లు సమాచారం. వివరాల్లో కెళితే ఉదయం ఎన్ హెచ్-4 చిత్రం తరువాత దర్శకుడు మణిమారన్ తదుపరి చిత్రాన్ని జయ్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట నటి త్రిషను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది.
 
 అయితే ఇటీవల ఆమె నిశ్చితార్థం విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు మణిమారన్ తన చిత్రాన్ని వేగంగా పూర్తి చేయదలచారట. దీంతో త్రిష వ ల్ల చిత్ర నిర్మాణం ఆలస్యం అవుతుందనే కారణంగా ఆమెను చిత్రం నుంచి తొలగించి ఇప్పుడు సురభిని ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ విషయం గురించి దర్శకుడు మణిమారన్ వద్ద ప్రస్తావించగా తాను చిత్రంలో ఇప్పటి వరకు ఏ హీరోయిన్‌ను ఎంపిక చేయలేదని అయితే నటి సురభితో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. చెన్నైలో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్‌లో సురభి ఈ వారంలో పాల్గొంటుందని కోలీవుడ్ తాజా వార్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement