సినీ నటి సురభి సందడి
Published Sun, Oct 16 2016 12:01 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM
కాకినాడ కల్చరల్ :
ప్రముఖ సినీ నటి, జెంటిల్‌మన్ ఫేమ్ సురభి శనివారం కాకినాడలో సందడి చేశారు. మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో కాసేపు ముచ్చటించారు. కాకినాడ రావడం తనకు తొలిసారని, ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉందని అన్నారు. తాను నటించిన జెంటిల్‌మన్, ఎక్స్‌ప్రెస్ రాజా, బీరువా తదితర చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్రాలన్నా, తెలుగు ప్రజలన్నా తనకు ఎంతో అభిమానమని అన్నారు. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పారు.
Advertisement
Advertisement