ఒక్క క్షణం! | Allu Sirish's film titled Okka Kshanam? | Sakshi
Sakshi News home page

ఒక్క క్షణం!

Published Fri, Nov 10 2017 1:03 AM | Last Updated on Fri, Nov 10 2017 3:40 AM

Allu Sirish's film titled Okka Kshanam? - Sakshi

ఏదైనా అర్జంటు పని మీద ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే.. ‘వన్‌ సెకండ్‌ ప్లీజ్‌’ అంటుంటాం. ఇప్పుడు అల్లు శిరీష్‌ అలానే అంటారని టాక్‌. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్‌ వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో శిరీష్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందులో సురభి, శీరత్‌ కపూర్‌ కథానాయికలు. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతోంది. ఈ సినిమాకి ‘ఒక్క క్షణం’ టైటిల్‌ పెట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అసలు సంగతి అదండీ. కథకి ఈ టైటిల్‌ సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం ఆలోచన అట. ఈ చిత్రానికి ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య ఓ వార్త వచ్చింది. ఇప్పుడు ‘ఒక్క క్షణం’ సీన్లోకి వచ్చింది. వన్‌ సెకండ్‌నే ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement