ఆదితో జతకట్టనున్న సురభి! | Surbhi Is Going To Pair With Aadi | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 23 2018 2:04 PM | Last Updated on Sat, Jun 23 2018 2:04 PM

Surbhi Is Going To Pair With Aadi - Sakshi

శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. చింతలపూడి శ్రీనివాస్ , చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా  రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభం కానుంది.

రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఆది లవర్‌ బాయ్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న  ఈ సినిమాలో ఆది జోడిగా సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ సురభి నటించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతమందిస్తున్న ఈ మూవీలో రావు రమేష్, ప్రియా, రాజీవ్ కనకాల ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement