ప్లీజ్‌ మేడమ్‌...త్వరగా టచప్‌ చేసుకోండి! | Seerat Kapoor and Surabhi for Allu Sirish | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ మేడమ్‌...త్వరగా టచప్‌ చేసుకోండి!

Published Fri, May 26 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

ప్లీజ్‌ మేడమ్‌...త్వరగా టచప్‌ చేసుకోండి!

ప్లీజ్‌ మేడమ్‌...త్వరగా టచప్‌ చేసుకోండి!

...మరీ ఈ రేంజ్‌లో రిక్వెస్ట్‌ చేస్తున్నది హీరోయిన్‌గారి అసిస్టెంట్‌ లేదా మేకప్‌మేన్‌ కాదు, హీరో అల్లు శిరీష్‌. సెట్టింగు, లైటింగు, సినిమా వింగ్‌ వింగు మొత్తం రెడీ. కానీ, హీరోయిన్‌ సురభి రెడీగా లేరు. మేకప్‌కి మెరుగులు అద్దుతూ టచప్‌ చేసుకుంటుండడంతో అందరూ వెయిటింగు అన్నమాట! కరెక్టుగా అప్పుడు సెట్‌లో ఓ కెమెరా క్లిక్‌మంది. ఆ ఫొటోనే మీరు చూస్తున్నారు. అల్లు శిరీష్, సురభి జంటగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు కదా. ఈ సీన్‌ ఆ సెట్‌లోది అన్నమాట. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సీరత్‌ కపూర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement