అలాంటి సినిమాలు చేయను! | i am not act in glamor roles says Surabhi | Sakshi
Sakshi News home page

అలాంటి సినిమాలు చేయను!

Published Sat, Jun 25 2016 10:38 PM | Last Updated on Sun, Aug 11 2019 12:30 PM

అలాంటి సినిమాలు చేయను! - Sakshi

అలాంటి సినిమాలు చేయను!

‘‘అందం, అభినయం.. నాకు రెండూ ముఖ్యమే. నటనలో రెండూ భాగమే. కథానాయికను కేవలం అందాల బొమ్మగా చూపించే చిత్రాలు, గ్లామర్ పాత్రలు చేయను’’ అని కథానాయిక సురభి స్పష్టం చేశారు. నాని, సురభి, నివేదా థామస్ నటీనటులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మన్’.
 
 ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల సురభి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ - ‘‘ నాని  పక్కన నటిస్తే మన నటన మెరుగవుతుంది. అందుకే తనతో మరిన్ని చిత్రాల్లో నటించాలని అనుకుంటున్నాను. ఈ సినిమా చిత్రీకరణలో నివేద, నేను మంచి స్నేహితులయ్యాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి పోటీ లేదు.
 
  మరో కథానాయికతో కలసి తెరను పంచుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. నాకు ఎటువంటి పాత్రలు సూటవుతాయో.. అవే ఎంపిక చేసుకుంటున్నాను. నా చిత్రాలన్నీ వరుసగా విజయం సాధించడం సంతోషంగా ఉంది. నటనతో పాటు నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటా. పెయింటింగ్‌లో కోర్స్ కూడా చేశాను’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement