నివేదా థామస్.. రాజ్‌కుమారీ అమృత్‌కౌర్
ఒక్క మాటలో వంద అర్థాలు దాగి ఉంటాయి. అన్ని అర్థాలను ఒక్కమాటలో చెప్పడమంటే లోకాన్ని చదివేసి ఉండాలి. సమాజాన్ని ఔపోసన పట్టి ఉండాలి. ‘మహిళ’ విషయంలో సమాజం ఎలా ఉంటుందో చెప్పకుండా చెప్పింది నివేదా థామస్. ఇటీవల ఆమె నటించిన ‘వి’ సినిమా విడుదల సందర్భంగా ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె నర్మగర్భంగా ఒక మాటన్నారు. ‘హీరోయిన్ పాత్ర రూపకల్పన అనేది చిత్ర నిర్మాత, దర్శకుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో భాషకు సంబంధం లేదు’ అన్నదామె. ఏ భాషలోనయినా హీరోయిన్‌ను గ్లామర్ డాల్‌గా చూపించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆమె అన్న మాటకు చాలా ప్రాధాన్యం ఉంది. స్త్రీ విషయంలో మన సమాజం దృష్టి కోణాన్ని చెప్పారు నివేద. ఇది ఇప్పటి సంగతి మాత్రమే కాదు. అయితే ఇప్పటి అమ్మాయిలు ధైర్యంగా, తెలివిగా వ్యక్తం చేస్తున్నారంతే.
ఇది సినిమాలకు మాత్రమే పరిమితమైన వివక్ష కాదు. రాజకీయరంగంలోనూ ఉందనడానికి రాజ్‌కుమారీ అమృత్ కౌర్ పెద్ద ఉదాహరణ. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి ఆరోగ్య మంత్రి కౌర్. ట్యూబర్ క్యులోసిస్ అసోసియేషన్, రెడ్‌క్రాస్ వంటి ఆరోగ్య సంస్థల్లో పని చేశారామె. మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజం లో శ్రద్ధ లేకపోవడానికి గమనించిన ఆమె గాంధీజీ, నెహ్రూల దగ్గర ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) స్థాపన అవసరాన్ని ప్రతిపాదించారు. తర్వాత ఎయిమ్స్ స్థాపన జరిగింది. కానీ పేరు, గుర్తింపు ఆమెకు రాలేదు. అంతే కాదు... ఆ తర్వాత రాజకీయాల్లో ఆమె పేరు కనిపించలేదు, వినిపించలేదు.
Comments
Please login to add a commentAdd a comment