హైదరాబాద్: ఇన్కాయిస్ అందించిన ముందుస్తు సమాచారం వల్లే హుద్హుద్ తుపానులో ప్రాణనష్టాన్ని తగ్గించ గలిగామని కేంద్ర మంత్రులు హర్షవర్థన్, సుజనా చౌదరి వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఇన్కాయిస్ 10వ వార్షికోత్సవ సభకు వారు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. సునామి లాంటి విపత్తులను ఆపడం సాధ్యం కానప్పటికీ భవిష్యత్తులో జరిగే విపత్తులను మాత్రం ఇన్కాయిస్ ద్వారా గుర్తించ వచ్చని హర్షవర్థన్, సుజనా చౌదరి తెలిపారు.