అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అబద్ధాల కోరని విధానసభలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ ఆరోపించారు. అబ ద్ధం చెప్పకపోతే ఆయనకు తిన్నది అరగదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు సృష్టించిన రగడ కారణంగా సభలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టలేకపోయినట్లు కేజ్రీవాల్ గురువారం రాత్రి ఫేస్‌బుక్‌లో తెలిపారని, అయితే నిజానికి గురువారంనాటి విధానసభ ఎజెండాలో ఆ అంశమే లేదన్నారు. ఎజెండాలో జన్‌లోక్ పాల్ అంశాన్ని చేర్చనప్పుడు దానిని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారంటూ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ఎజెండాలో మొదటి స్థానం నుంచి ఐదోస్థానానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఒత్తిళ్లకు లొంగరాదని హితవు పలికారు. సభ ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వం సృష్టిస్తున్న అయోమయంపై కాంగ్రెస్ సభ్యులు అర్విందర్‌సింగ్ లవ్లీ , హరూన్ యూసఫ్ మండిపడ్డారు. బుధవారం తమకు అర్ధరాత్రి అందించిన ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతారని ఉందని, కానీ గురువారం మధ్యాహ్నానానికి ఎజెండా మారి పోయిందన్నారు. అందులోనుంచి జన్‌పాల్ బిల్లును ఉపసంహరించారన్నారు. శుక్రవారం కూడా మరోసారి ఎజెండా మారిపోయిందని, గురువారం రాత్రి తమకు అందిన సమాచారం ప్రకారం జన్‌లోక్‌పాల్ బిల్లు ఎజెండాలో మొదటి స్థానంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నానికి ఐదోస్థానానికి మారిపోయిందని ఆయన చెప్పారు. జన్ లోక్‌పాల్ పై ప్రచారం చేసుకుంటున్న సర్కారు దానిని ఎజెండాలో ఐదో స్థానంలో ఉంచడమేమిటంటూ ఆయన ఎద్దేవా చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు కాంగ్రెస్ సభా పక్ష నేత హరూన్‌యూసఫ్‌తోపాటు పలువురికి అందలేదని లవ్లీ తెలిపారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ,
మిగతా 8వ పేజీలో ఠ
ఠ7వ పేజీ తరువాయి
కాంగ్రెస్ సభ్యులు సంత్ రవిదాస్ జయంతిరోజునే అసెంబ్లీ నిర్వహించడంపై అభ్యంతరం లేవనెత్తారు. సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని సభా కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ రామ్‌బీర్‌సింగ్ బిధూరీ నోటీసు ఇచ్చారు. కేజ్రీవాల్ సంప్రదాయాలకు తిలోకదకాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు కూడా సంత్ రవిదాస్ జయంతి రోజు సమావేశం కావడం లేదన్నారు. సభా కార్యక్రమాలను నిర్వహించడమే సంత్ రవిదాస్‌కు నిజమైన శ్ర ద్ధాంజలి అంటూ స్పీకర్ ధీర్ ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు. దీనిపై కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, జేడీయూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రయివేటు మెంబర్ల బిల్లులను చేపట్టే రోజని, అలాంటి రోజున ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడంపై లవ్లీతో పాటు హర్షవర్దన్, షోయబ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ సభా సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని వారు ఆరోపించారు. దానికి స్పీకర్ ధీర్ ప్రతిస్పం దిస్తూ గతంలో శుక్రవారం రోజున ఇతర కార్యక్రమాలు జరిగాయన్నారు. శాసనసభ చరిత్రలో అటువంటి కార్యకలాపాలు జరిగిన రోజులను ఉటంకించారు.
4
మరికొంత సమయం కావాలి
న్యూఢిల్లీ: మిడ్‌నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్‌లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు.
అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్
Published Fri, Feb 14 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM
Advertisement
Advertisement