cajriwal
-
ఆప్ నిర్ణయాలు యథాతథం
ఆప్ నిర్ణయాలు యథాతథం కొనసాగించనున్న ఎల్జీ సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ చార్జీలను 25 శాతం తగ్గించడం, అవినీతి నిరోధక హెల్ప్‌లైన్,ఉచిత నీటి సరఫరా తదితర కీలక నిర్ణయాలు కొనసాగనున్నాయి. వీటిని కొనసాగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రధాన విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. 49 రోజుల పాలనలో ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, తాజా పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయన ముందుంచారు. ఆప్ సర్కారు తీసుకున్న అనేక కీలక నిర్ణయాలకు సంబంధించి తదుపరి కార్యాచరణను అధికారులతో చర్చించిన ఎల్జీ...వాటిని ఇకపై కూడా కొనసాగించాలని నిర్ణయించారు. నెలకు 400 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గిస్తూ కేజ్రీవాల్ సర్కారు అందించిన సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించారు. అవినీతి నిర్మూలన కోసం ఆప్ సర్కారు 1031 నం బరుతో ప్రారంభించిన హెల్ప్లెన్ను కూడా కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఈ హెల్ప్‌లైన్‌లో పని చేస్తున్న వారిలో అనేకమంది ఆప్ కార్యకర్తలే. పాలనాధికారం తనకు రావడంతో వారి స్థానంలో ప్రభుత్వోద్యోగులను నియమించాలని ఎల్జీ నిర్ణయించారు. ఉచిత నీటిసరఫరాకు సంబంధించి కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఆయన అమలు చేయనున్నారు. కేజ్రీవాల్ రాజీనామాతో ఊపిరిపీల్చుకున్న అధికారులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దె దిగడంతో సచివాలయంలో ఒక్కసారిగా వాతావ రణం మారిపోయింది. అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. కేజ్రీవాల్, ఆయన మంత్రులు సంప్రదాయానికి విరుద్ధంగా, ఊహించని రీతిలో ప్రవర్తించేవారని, దానితో అన్ని శ్రేణుల ఉద్యోగులలో అయోమయంలో కొట్టుమిట్టాడేవారని వారంటున్నారు. కేజ్రీవాల్‌కు, ఆయన మంత్రులకు తమ కింద పనిచేసే ఉద్యోగులపై నమ్మకం ఉండేది కాదని వారంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు జరపకుండా వాగ్దానాలు ఇవ్వడం వల్ల ప్రజలు తమను తిప్పలుపెట్టే ప్రమాదం ఉందంటూ తాము కేజ్రీవాల్‌ను, ఆయన మంత్రులను హెచ్చరించామని వారు అంటున్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లులో ఉద్యోగులకు ప్రతిపాదించిన శిక్షలు తమకే కాకుండా తమ కుటుంబీకులకు భయం పుట్టించాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి అధికారి చెప్పారు. ఎవరు వల పన్నుతారోననే భయం తమను వేధించేదన్నారు. అందువల్ల తమను ఢిల్లీనుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాల్సిందిగా పలువురు ఉన్నతాధికారులు హోం మంత్రిత్వశాఖను కూడా ఆశ్రయించారని ఆయన చెప్పారు. -
ఆప్ డప్పు తప్పు!
అధికారంలో కొద్దిరోజులే ఉన్నప్పటికీ తమ పాలనలో ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ అర్వింద్ కేజ్రీవాల్ తదితర ఆప్ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఖండించింది. అయితే తాము పొరబడ్డామంటూ ఆప్ చివరకు వివరణ ఇచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. తమ పాలనాకాలంలో ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పుకుంటోన్న మాటలలో నిజమెంత? అనే విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. అర్వింద్ కేజ్రీవాల్ హయాంలో అవినీతి తగ్గిందంటూ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా అధ్యయనంలో తేలిందని ఆప్ నేతలు ఎంతో ఘనంగా చెప్పుకున్నారు. అయితే తాము అలాంటి అధ్యయనమేదీ నిర్వహించలేదని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. దీంతో తమ తప్పిదానికి క్షమాపణ చెప్పింది. సోమవారం మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సీఐఐ సమావేశంలో వాణిజ్యవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ పాలనలో ఢిల్లీలో అవినీతి తగ్గిందని, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో అవినీతి తగ్గిందని తెలిపే నివేదికను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేయనున్నట్లు తనకు తెలిసిందన్నారు. అంతకుమునపు ఆప్ నేత షాజియా ఇల్మీ కూడా ఇలాంటి మాటలే చెప్పారు. ఢిల్లీలో అవినీతి తగ్గిపోయిందంటూ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించిందని ఆప్ నేత షాజియా.... హిందుస్తాన్ టైమ్స్ ఆంగ్ల దినపత్రిక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఢిల్లీలో అవినీతిపై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ అధ్యయనం జరిపించిందని, ఆప్ 45 రోజుల పాలనపై ఆ సంస్థ ఇంకా ప్రచురించని నివేదిక పేర్కొందని, ఇది ఆప్ సాధించిన ఘన విజయమని షాజియా ఇల్మీ చెప్పిట్లుగా హిందుస్తాన్ టైమ్స్‌లో ఓ వార్త ప్రచురితమైంది. అదేమీ లేదు: అశుతోష్ అయితే దీనిని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండి యా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశుతోశ్కుమార్ మిశ్రా ఖండించారు. షాజియా మాటలు నిజం కాదని, తాము ఢి ల్లీలో అవినీతిపై ఎలాంటి అధ్యయనం జరపలేదని అందువల్ల దీనికి సంబంధించి ప్రచురిత , అప్రచురిత నివే దిక ఏదీ లేదని పత్రికాప్రకటన ద్వారా స్పష్టం చేసింది. నివేదిక విషయంలో పొరపాటు పడినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ క్షమాపణ తెలిపింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పట్ల తమ కు గౌరవం ఉందని, సర్వే విషయంలో తమ పొరపాటు వల్ల ఆ సంస్థకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నామని, ఇందుకు క్షమించాలని పార్టీ కోరింది. షాజియాకు సర్వే గురించి తెలిపిన వ్యక్తి ఆ సంస్థ నుంచి వైదొలగినట్లు ఆప్ తెలిపింది. దీనిపై షాజియా ప్రతిస్పందిస్తూ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కావచ్చు లేదా ఒపాసిటీ ఇంటర్నేషనల్ కావచ్చు. ఏదైతేనేం ఢిల్లీలో అవినీతి తగ్గిందన్నది మాత్రం నిజమని చెప్పారు. -
అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్
అబద్ధాలకోరు కేజ్రీవాల్‌పై హర్షవర్ధన్ సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ అబద్ధాల కోరని విధానసభలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ ఆరోపించారు. అబ ద్ధం చెప్పకపోతే ఆయనకు తిన్నది అరగదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు సృష్టించిన రగడ కారణంగా సభలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టలేకపోయినట్లు కేజ్రీవాల్ గురువారం రాత్రి ఫేస్బుక్లో తెలిపారని, అయితే నిజానికి గురువారంనాటి విధానసభ ఎజెండాలో ఆ అంశమే లేదన్నారు. ఎజెండాలో జన్‌లోక్ పాల్ అంశాన్ని చేర్చనప్పుడు దానిని బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారంటూ కేజ్రీవాల్ అసత్య ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. జన్‌లోక్‌పాల్ బిల్లును ఎజెండాలో మొదటి స్థానం నుంచి ఐదోస్థానానికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఒత్తిళ్లకు లొంగరాదని హితవు పలికారు. సభ ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లుపై ప్రభుత్వం సృష్టిస్తున్న అయోమయంపై కాంగ్రెస్ సభ్యులు అర్విందర్‌సింగ్ లవ్లీ , హరూన్ యూసఫ్ మండిపడ్డారు. బుధవారం తమకు అర్ధరాత్రి అందించిన ఎజెండాలో జన్‌లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడతారని ఉందని, కానీ గురువారం మధ్యాహ్నానానికి ఎజెండా మారి పోయిందన్నారు. అందులోనుంచి జన్‌పాల్ బిల్లును ఉపసంహరించారన్నారు. శుక్రవారం కూడా మరోసారి ఎజెండా మారిపోయిందని, గురువారం రాత్రి తమకు అందిన సమాచారం ప్రకారం జన్‌లోక్‌పాల్ బిల్లు ఎజెండాలో మొదటి స్థానంలో ఉండగా శుక్రవారం మధ్యాహ్నానికి ఐదోస్థానానికి మారిపోయిందని ఆయన చెప్పారు. జన్ లోక్‌పాల్ పై ప్రచారం చేసుకుంటున్న సర్కారు దానిని ఎజెండాలో ఐదో స్థానంలో ఉంచడమేమిటంటూ ఆయన ఎద్దేవా చేశారు. జన్ లోక్‌పాల్ బిల్లు ప్రతులు కాంగ్రెస్ సభా పక్ష నేత హరూన్యూసఫ్తోపాటు పలువురికి అందలేదని లవ్లీ తెలిపారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ, మిగతా 8వ పేజీలో ఠ ఠ7వ పేజీ తరువాయి కాంగ్రెస్ సభ్యులు సంత్ రవిదాస్ జయంతిరోజునే అసెంబ్లీ నిర్వహించడంపై అభ్యంతరం లేవనెత్తారు. సంత్ రవిదాస్ జయంతిని పురస్కరించుకుని సభా కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ రామ్బీర్సింగ్ బిధూరీ నోటీసు ఇచ్చారు. కేజ్రీవాల్ సంప్రదాయాలకు తిలోకదకాలు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్లమెంటు కూడా సంత్ రవిదాస్ జయంతి రోజు సమావేశం కావడం లేదన్నారు. సభా కార్యక్రమాలను నిర్వహించడమే సంత్ రవిదాస్‌కు నిజమైన శ్ర ద్ధాంజలి అంటూ స్పీకర్ ధీర్ ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు. దీనిపై కాంగ్రెస్‌కు చెందిన అర్విందర్ సింగ్ లవ్లీ, జేడీయూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్‌లు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రయివేటు మెంబర్ల బిల్లులను చేపట్టే రోజని, అలాంటి రోజున ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడంపై లవ్లీతో పాటు హర్షవర్దన్, షోయబ్ ఇక్బాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ సభా సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని వారు ఆరోపించారు. దానికి స్పీకర్ ధీర్ ప్రతిస్పం దిస్తూ గతంలో శుక్రవారం రోజున ఇతర కార్యక్రమాలు జరిగాయన్నారు. శాసనసభ చరిత్రలో అటువంటి కార్యకలాపాలు జరిగిన రోజులను ఉటంకించారు. 4 మరికొంత సమయం కావాలి న్యూఢిల్లీ: మిడ్నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు. -
ప్రతిక్షణం ఉత్కంఠే!
ప్రతిక్షణం ఉత్కంఠే! అధికార పక్షం దిగ్భ్రమ విజయగర్వంతో విపక్షం న్యూఢిల్లీ: జన్ లోక్‌పాల్‌బిల్లు బిల్లు సభ ఆమోదం పొందనట్లయితే రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగా యి. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో రాజీపడబోమంటూ మంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేయడం, కేజ్రీవాల్ దానిని రీ ట్వీట్ చేయడంతో ఉదయం నుంచే రసవత్తర రాజకీయం మొదలైంది. రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టనట్లయితే బిల్లుకు తాను మద్దతు ఇవ్వబోనని జేడీయూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్ స్పష్టం చేశారు. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఆప్ శాసనసభ్యుల మధ్య విభేదాలొచ్చాయంటూ వదంతులు వెల్లువెత్తాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో చట్టబద్ధమైన ప్రక్రియను పాటించాలని ఆప్ ఎమ్మెల్యే అశోక్ అగర్వాల్ కోరినట్లు కూడా సమాచారం. ఇంతలోనే లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ బాంబు బద్దలైంది. జన్‌లోక్‌పాల్ బిల్లుకు ప్రభుత్వం తన అనుమతి తీసుకోలేదని, నియమాలను పాటించలేదని, అందువల్ల దానిని సభలో ప్రవేశపెట్టడానికి అనుమతించరాదంటూ స్పీకర్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాసినట్లు వెల్లైడైంది. సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు ప్రభుత్వం తన అనుమతి తీసుకోలేదని, అందువల్ల ఈ బిల్లును పరిగణనకు తీసుకోరాదంటూ స్పీకర్ ఎం.ఎస్. ధీర్‌కు....ఎల్జీ లేఖ రాశారు. ’రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రవేశపెట్టే జన్‌లోక్‌పాల్ బిల్లుకు తాము మద్దతు ఇవ్వబోమని బీజే పీ, కాంగ్రెస్ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, బీజేపీ నేత హర్షవర్ధన్ ఆరోపించారు. ఈ బిల్లును తన అనుమతి లేకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టరాదని ఎల్జీ... స్పీకర్‌కు ఓ లేఖ రాసినట్లు తెలియడంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాలు ఆయనను కలిశారు. ఇదిలాఉంచితే ఈబిల్లు రాజ్యాంగబద్ధమేనని మనీష్ సిసోడియా ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత ఎల్జీ లేఖను చదివి వినిపించాలంటూ విపక్షసభ్యులు డిమాండ్ చేశారు. వెసులుబాటుకు అనుగుణంగా లేఖ చదువుతానంటూ స్పీకర్ చెప్పిన మాటలను సభ్యులు పట్టించుకోలేదు. వెంటనే ఆ లేఖను చదివి వినిపించాలంటూ సభ్యులు కోరారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను 20 నిమిషాలపాటు వాయిదావేశారు. 20 నిమిషాల తరువాత సభ తిరిగి సమావేశమవ గానే స్పీకర్ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖను స్పీకర్ చదివి వినిపించారు. కాగా తన అనుమతి లేని బిల్లును సభ పరిగణించరాదని, సభలో ప్రవేశపెట్టడానికి ముందు తన లేఖను అందరికీ చదివి వినిపించాలంటూ ఆదేశించాలని ఎల్జీ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరిపించాలంటూ ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై చర్చ జరపాలని మంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. ఓటింగ్ గురించి లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొనలేదని, బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు సభకు తన లేఖను చదివి వినిపించాలని మాత్రమే ఎల్జీ పేర్కొన్నారని కేజ్రీవాల్ అన్నారు. ఓటింగ్‌కు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి స్పీకర్ అనుమతిం చడం, కేజ్రీవాల్ దానిని ప్రవేశపెట్టడం, బిల్లును సభలో ప్రవేశపెట్టారని స్పీకర్ ప్రకటించడం వెంట వెంటనే జరిగిపోవడంతో అధికార పార్టీ సభ్యులు ఆనందంలో, ప్రతిపక్షసభ్యులు దిగ్భ్రమలో మునిగి పోయారు. గందరగోళం మధ్య స్పీకర్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. ఇదిలాఉంచితే అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని, ఇది తమ విజయమని ఆప్ నేతలు, మంత్రులు పేర్కొనగా, ఎల్జీ ఆదేశానికి భిన్నంగా బిల్లును ప్రవేశపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని మిగతా 8వ పేజీలో ఠ ఠ7వ పేజీ తరువాయి ప్రతి పక్ష పార్టీలు ఆరోపించాయి. స్పీకర్ పక్షపాత ధోరణితో, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. బిల్లును అసలు ప్రవేశపెట్టలేదంటూ వాదించారు. సభ ప్రారంభమైన తర్వాత ఎల్జీ ఆదేశాన్ని పక్కనపెట్టి బిల్లు ప్రవేశపెట్టిన తీరును కాంగ్రెస్, బీజెపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిల్లు ప్రవేశపెట్టారా? లేదా ? అనే దానిపై ఓటింగ్ జరిపించారు. బిల్లు ప్రవేశపెట్టారనే దానికి 27, ప్రవేశపెట్టలేదనే దానికి 42 ఓట్లు లభించాయి. 32 మంది బీజేపీ సభ్యులు, ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు, ఓ జేడీయూ సభ్యుడితోపాటు మరో స్వతంత్ర శాసనసభ్యుడు ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. దీంతో సభలో బిల్లును ప్రవేశపెట్టలేదంటూ స్పీకర్ ధీర్ లాంఛనంగా ప్రకటించారు.