
ఈ ఫొటో సరిగ్గా చూశారా.. కుడివైపున సీఎం చంద్రబాబు అని అందరికీ తెలుసు.. పక్కన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబులు కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇదే ఫొటోలో ఎడమ వైపున సరిగ్గా చంద్రబాబుకు ఎదురుగా పసుపు చొక్కా, కండువా వేసుకున్న వ్యక్తి ఎవరో పోల్చుకున్నారా.. ఆయనేనండి.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలక వ్యక్తి, ప్రధాన నిందితుడు జె. శ్రీనివాసరావు పని చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి. అయితే ఇప్పుడేంటీ అంటారా? గత అక్టోబర్ ఆఖరులో దేశ వ్యాప్తంగా ఆ ఘటన కలకలం రేపిన సమయంలో హర్షవర్ధన్ చౌదరి మీడియా ముందుకు వచ్చి చాలా బీరాలుపోయారు.
అనవసరంగా నన్ను టీడీపీ వ్యక్తి అంటున్నారని వాపోయాడు. గతంలో గాజువాక టికెట్ ఆశించి ఆ పార్టీలో తిరిగిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. టీడీపీలో తాను లేనని పలుమార్లు స్పష్టం చేశారు. కానీ ఆదివారం విశాఖ నగరంలో జరిగిన చంద్రబాబు ప్రచార సభలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలన మొదలు అన్నీ దగ్గరుండి నడిపించారు. చంద్రబాబు, హర్షవర్ధన్ చౌదరిల విడదీయరాని బంధానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాలి?
– గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment