మామా మాశ్చీంద్ర: సుధీర్‌ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ చూశారా? | Sudheer Babu, Harshavardhan Movie Mama Mascheendra First Look Out | Sakshi
Sakshi News home page

Sudheer Babu: ఇంట్రస్టింగ్‌గా సుధీర్‌ బాబు కొత్త సినిమా టైటిల్‌

Published Wed, May 11 2022 5:40 PM | Last Updated on Wed, May 11 2022 5:44 PM

Sudheer Babu, Harshavardhan Movie Mama Mascheendra First Look Out - Sakshi

యంగ్‌ టాలెంటెడ్‌ హీరో సుధీర్‌ బాబు బర్త్‌డే నేడు (మే 11). ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. హర్షవర్ధన్‌ దర్శకత్వంలో సుధీర్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేశారు. మామా మశ్చీంద్ర అన్న టైటిల్‌తో పాటు సుధీర్‌ లుక్‌ను సైతం విడుదల చేశారు. ఇందులో హీరో స్టేజీపై సాంగ్‌ పాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా పీజీ వింద సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుధీర్‌బాబు కృతిశెట్టితో కలసి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' త్వరలోనే విడుదల కానుంది.

చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్‌కు నటి కౌంటర్‌

ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్‌ యూనివర్స్‌.. ఆవేదనలో ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement