పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గత నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌కు చెందిన 50 కోట్ల యూజర్ల వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టారు. తాజాగా భారత్‌కు చెందిన మరో 6 లక్షల మంది పర్సనల్ డేటాను బోట్ మార్కెట్(ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్) లో అమ్ముకున్నట్లు తేలింది. పలు నివేదికల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది వ్యక్తిగత వివరాల్ని సైబర్ నేరస్తులు దొంగిలించారు. ఆ డేటాను బోట్ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.
2018 నుండి
ప్రపంచంలో అతి పెద్ద వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) సర్వీస్ ప్రొవైడర్ నార్డ్ వీపీఎన్ కు చెందిన లూథూనియా నార్డ్ సెక్యూరిటీ రీసెర్చ్ బోట్ మార్కెట్‌ను ట్రాక్ చేసింది. 2018లో తొలిసారి బోట్ మార్కెట్ విడుదలైంది. నాటి నుంచి ఆ మార్కెట్ పనితీరుపై నార్డ్ వీపీఎన్ దృష్టిసారించగా..యూజర్ల వివరాలు బోట్ మార్కెట్‌లో లభ్యమవుతున్నట్లు గుర్తించింది. తన రిసెర్చ్‌లో భాగంగా ప్రధానమైన జెనెసిస్ మార్కెట్, రష్యన్ మార్కెట్, 2 ఈజీ బోట్ మార్కెట్‌లతో పాటు దొంగిలించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లాగిన్ ఐడీలు ఉన్నట్లు చెప్పింది.
రూ.490కే
నాటి నుంచి బోట్ మాల్‌వేర్ సాయంతో హ్యాకర్స్ యూజర్లు వినియోగిస్తున్న ఫోన్, ల్యాప్‌ట్యాప్, పర్సనల్ కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వారి లాగిన్ ఐడీలు, కుకీస్, డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, స్క్రీన్ షాట్‌లతో పాటు ఇతర వ్యక్తిగత వివరాల్ని తస్కరించారు. ఒక్కో యూజర్ డేటాను రూ.490కి అమ్ముకున్నట్లు తేలింది.
ఆటో ఫామ్స్ ఫిల్ చేస్తున్నారా?
ఆటో ఫామ్స్ అంటే? ఏదైనా సంస్థ తన ప్రొడక్ట్ ఎలా ఉందో తెలిపేలా లేదంటే.. ఏదైనా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలంటే ముందుకు గూగుల్ ఫారమ్స్ తరహాలో ఆటో ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫారమ్ ఫిల్ చేసిన యూజర్ల డేటా 667 మిలియన్ కుకీస్, 81వేల డిజిటల్ ఫింగర్ ప్రింట్స్, 5లక్షల 38 ఆటో ఫారమ్స్ ఫిల్స్, భారీ ఎత్తున స్క్రీన్ షాట్‌లు, వెబ్ క్యామ్ స్నాప్‌ల నుంచి డేటాను సేకరించినట్లు నార్డ్ వీపీఎన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారిజస్ బ్రీడిస్ తెలిపారు.
డార్క్ వెబ్ వర్సెస్ బోట్ మార్కెట్
డార్క్ వెబ్ మార్కెట్‌ల కంటే బోట్ మార్కెట్‌లు విభిన్నంగా ఉంటాయి. బోట్ మార్కెట్‌లు ఉదాహరణకు ఒక వ్యక్తి గురించి ఒక్క డివైజ్ ద్వారా భారీ మొత్తంలో డేటాను సేకరిస్తాయని బ్రీడిస్ అన్నారు.
ఐసీఎంఆర్‌పై 6వేల సార్లు దాడులు
వాట్సాప్ తర్వాత దేశంలో భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)పై సైబర్ దాడికి యత్నించారు.ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌పై సుమారు 6వేల సార్లు దాడి చేశారు. విఫలమయ్యారు. పటిష్ట భద్రత కారణంగా సైబర్ నేరస్తుల ఐసీఎంఆర్ వైబ్ సైట్ నుంచి డేటాను పొందలేకపోయారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment