ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. తద్వారా వీపీఎన్ అవసరం లేకుండా వెబ్‌సైట్‌లలోని ఐపీ అడ్రస్‌లు కనిపించకుండా హైడ్ చేసుకోనే అవకాశం యూజర్లకు కల్పించనుంది.
సాధారణంగా ఐపీ అడ్రస్‌ను ఉపయోగించి క్రోమ్ యూజర్లు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.దీన్ని నివారించేలా గూగుల్ ప్రాక్సీ సర్వర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో ఒరిజనల్ ఐపీ అడ్రస్ స్థానంలో ట్రాక్ చేసేందుకు వీలులేకుండా గూగుల్ ప్రొక్సీ ఐపీ అడ్రస్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా, యూజర్ల ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుందని ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్ ఓ నివేదికను విడుదల చేసింది.
ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే
ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రియానా గోల్డ్స్టీన్ మాట్లాడుతూ..అమెరికాలో ఎంపిక చేసిన క్రోమ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. వీళ్లు మాత్రమే గూగుల్.కామ్, జీమెయిల్,గూగుల్ యాడ్ సర్వర్‌లతో పాటు గూగుల్ ఆదీనంలో ఉన్న డొమైన్‌లకు ఈ ప్రోక్సీ ఐపీ అడ్రస్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు.
గూగుల్ ఉద్దేశం ఇదే
ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం క్రోమ్ వెబ్ సైట్‌ల ఐపీ అడ్రస్‌లను దాచడమే కాదు. యూజర్లను ట్రాక్ చేసేందుకు వినియోగించే కూకీలను సైతం బ్లాక్ చేస్తుంది. అయితే, ఐపీ అడ్రస్ మీద ఆధారపడే చట్టబద్ధమైన కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ యూజర్లకు హామీ ఇస్తోంది.
ముందంజలో యాపిల్
ఈ లేటెస్ట్ టెక్నాలజీని యాపిల్ ఐక్లౌడ్ ప్రైవేట్ రిలే ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇది నెట్‌వర్క్ ప్రొవైడర్లు యాపిల్ వినియోగదారుల ఐపి అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ముందుగా డీఎన్ఎస్ రికార్డులను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. తరువాత వెబ్‌సైట్‌లను యాక్సెస్ చేసేందుకు తాత్కాలిక ఐపీ అడ్రస్‌ను క్రియేట్ చేసేలా థర్డ్ పార్టీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తుంది.
థర్ట్ పార్టీ సైట్ల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా
ప్రైవసీ ఆప్షన్లను మెరుగుపరచడానికి గూగుల్ తీసుకున్న చర్య, థర్డ్ పార్టీ కుకీల వల్ల ఎదురయ్యే సవాళ్లకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ప్రైవసీ శాండ్ బాక్స్‌ను విడుదల చేసింది. 2024 నాటికి కుకీలను నిలిపివేయాలన్నది గూగుల్ ప్రణాళిక. ఐపీ ప్రొటెక్షన్‌తో వెబ్ సైట్లలో వినియోగదారులను ట్రాక్ చేయడానికి థర్డ్ పార్టీ సైట్లను తగ్గించనుంది.
Comments
Please login to add a commentAdd a comment