Browsing
-
గూగుల్ క్రోమ్ యూజర్లకు ముఖ్య గమనిక!
ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌లో కొత్త ఫీచర్‌ను జోడించనుంది. తద్వారా వీపీఎన్ అవసరం లేకుండా వెబ్సైట్లలోని ఐపీ అడ్రస్‌లు కనిపించకుండా హైడ్ చేసుకోనే అవకాశం యూజర్లకు కల్పించనుంది. సాధారణంగా ఐపీ అడ్రస్‌ను ఉపయోగించి క్రోమ్ యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు.దీన్ని నివారించేలా గూగుల్ ప్రాక్సీ సర్వర్‌ను అందుబాటులోకి తేనుంది. దీంతో ఒరిజనల్ ఐపీ అడ్రస్ స్థానంలో ట్రాక్ చేసేందుకు వీలులేకుండా గూగుల్ ప్రొక్సీ ఐపీ అడ్రస్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఫలితంగా, యూజర్ల ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతుందని ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ సందర్భంగా గూగుల్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బ్రియానా గోల్డ్‌స్టీన్ మాట్లాడుతూ..అమెరికాలో ఎంపిక చేసిన క్రోమ్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. వీళ్లు మాత్రమే గూగుల్.కామ్, జీమెయిల్,గూగుల్ యాడ్ సర్వర్లతో పాటు గూగుల్ ఆదీనంలో ఉన్న డొమైన్లకు ఈ ప్రోక్సీ ఐపీ అడ్రస్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. గూగుల్ ఉద్దేశం ఇదే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం క్రోమ్ వెబ్ సైట్ల ఐపీ అడ్రస్‌లను దాచడమే కాదు. యూజర్లను ట్రాక్ చేసేందుకు వినియోగించే కూకీలను సైతం బ్లాక్ చేస్తుంది. అయితే, ఐపీ అడ్రస్ మీద ఆధారపడే చట్టబద్ధమైన కార్యకలాపాలకు అంతరాయం లేకుండా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ యూజర్లకు హామీ ఇస్తోంది. ముందంజలో యాపిల్ ఈ లేటెస్ట్ టెక్నాలజీని యాపిల్ ఐక్లౌడ్ ప్రైవేట్ రిలే ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఇది నెట్వర్క్ ప్రొవైడర్లు యాపిల్ వినియోగదారుల ఐపి అడ్రస్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ముందుగా డీఎన్ఎస్ రికార్డులను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. తరువాత వెబ్సైట్లను యాక్సెస్ చేసేందుకు తాత్కాలిక ఐపీ అడ్రస్‌ను క్రియేట్ చేసేలా థర్డ్ పార్టీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తుంది. థర్ట్ పార్టీ సైట్ల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంగా ప్రైవసీ ఆప్షన్లను మెరుగుపరచడానికి గూగుల్ తీసుకున్న చర్య, థర్డ్ పార్టీ కుకీల వల్ల ఎదురయ్యే సవాళ్లకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా ప్రైవసీ శాండ్ బాక్స్‌ను విడుదల చేసింది. 2024 నాటికి కుకీలను నిలిపివేయాలన్నది గూగుల్ ప్రణాళిక. ఐపీ ప్రొటెక్షన్‌తో వెబ్ సైట్లలో వినియోగదారులను ట్రాక్ చేయడానికి థర్డ్ పార్టీ సైట్లను తగ్గించనుంది. -
పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..!
సాక్షి, అమరావతి: దేశంలో డేటా ట్రాఫిక్ పెరుగుతోంది. మొబైల్ వినియోగంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ఏకంగా 3.2 రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా.. 2027 నాటికి 46 జీబీకి చేరుకుంటుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే... ఒక వ్యక్తి ద్వారా నెలలో 136 శాతం డేటా వాడకం పెరగనుంది. దేశంలో చౌకగా మొబైల్ డేటా లభిస్తుండటంతోపా టు హైస్పీడ్ 5జీ నెట్వర్క్ విస్తరణతో డేటా విస్తతిలో గణనీ య మైన మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సంస్థలు వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ డేటా నెట్‌వర్క్‌ల కోసం సుమారు 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. 240 గంటలకు పైగా బ్రౌజింగ్ ప్రపంచ జనాభాలో దాదాపు 65.60 శాతం మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. 4.60 బిలియన్ల మంది ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో అయితే 65 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్ బైట్ల డేటా అవసరం అవుతోంది. భారత్‌లో అయితే, ప్రస్తుతం సగటున నెలకు ఒక వ్యక్తి 240 గంటలకుపైగా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేస్తున్నారు. ఈ లెక్కన దేశం మొత్తం ఒక నెలకు డేటా వినియోగం 14 ఎక్సాబైట్లకు చేరుకుంది. ఇక్కడ ఒక ఎక్సాబైట్ ఒక బిలియన్ గిగాబైట్లకు సమానం. చౌకైన డేటా! ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ ఒక జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్ డాలర్లుగా ఉంది. యూకే డేటా గణాంకాల వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులు స్మార్ట్ఫోను వినియోగిస్తుండటంతో ఇది అమెరికా కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్ల వ్యాప్తిని కలిగి ఉంది. తక్కువ రేటుకు మొబైల్ డేటా అందిస్తున్న దేశాల్లో ఇటలీ (0.12 డాలర్లు) రెండవ, భారత్ (0.17 డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. మరోవైపు అత్యంత ఖరీదైన డేటా ప్లాన్లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్ దీవుల్లో ప్రజలు ఒక జీబీ డేటా కోసం 38.45 డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్ హెలెనాలో అయితే 41.06 డాలర్లుగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇజ్రాయెల్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వెచి్చంచి మొబైల్ డేటాను కొనుగోలు చేస్తున్నారు. -
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ చాటింగ్‌లు, బ్రౌజింగ్‌లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్‌గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్ మోడ్ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్ నొక్కాలి. ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్లెట్లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200. -
ఉచితంగా 45 నిమిషాలు వైఫై
ఉచితంగా వైఫై సేవలు 45 నిమిషాల సదుపాయం 15 రోజుల్లోఅందుబాటులోకి ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ సిటీ నెటిజన్లకు శుభవార్త. ఇక నగరం నలుమూలలా హ్యాపీగా బ్రౌజింగ్ చేసుకునేందుకు..ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఉచితంగా పొందేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ పరిధిలో వంద ప్రాంతాల్లో ఒకే రోజు ఉచిత వైఫై హాట్స్పాట్లను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజలకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో పలువురు తాము ఉచిత సేవలందిస్తామని..అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీని ఆశ్రయిస్తుండటంతో.. వచ్చే 15 రోజుల్లో వంద ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లు, హైకోర్టు ప్రాంగణం, ఇమ్లిబన్, జూబ్లీ బస్టాండ్లు, కేబీఆర్, సంజీవయ్య, వెంగళ్రావు, ఇందిరాపార్కులతో సహ ఆరు ప్రధాన పార్కుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం వంద ప్రాంతాల్లో ఒకేరోజు వీటిని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాలపాటు ఈ ఉచిత సదుపాయం లభిస్తుంది. ఈ ఉచిత సదుపాయంతోపాటు ..ఇప్పటికే ఆయా ప్రైవేట్ సంస్థలనుంచి ఇళ్లకు ఇంటర్నెట్ ను వినియోగించుకుంటున్నవారు తమ యూజర్ లాగిన్, పాస్‌వర్డ్‌లను వినియోగించుకొని కూడా ఈ వంద స్పాట్లలో వైఫై సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ వినియోగం వారి ఖాతాలో నమోదవుతుంది. ఇప్పటికే మొబైల్ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న జీహెచ్ఎంసీ.. ప్రజలు ఎక్కడినుంచైనా తమ ఫిర్యాదులు పంపించేందుకు.. పరిష్కారమయ్యిందీ లేనిదీ తెలుసుకునేందుకు కూడా ఈ ఉచిత వైఫై సదుపాయం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. వాట్సప్ ద్వారా రహదారులపై గుంతలు, చెత్త తొలగించని ప్రాంతాలు తదితర ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ ఉచిత వైఫై సేవలు ఉకరించగలవని అంచనా వేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్రోడ్లతో సహ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 30 ప్రాంతాల్లో ఇప్పటికే 20 నిమిషాల ఉచిత వై ఫై సదుపాయం క ల్పిస్తుండటం తెలిసిందే. ఇదే తరహాలో మరో వంద ప్రాంతాల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 45 నిమిషాలపాటు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వైఫై ఉంటే.. ఆన్లైన్లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. వాట్సప్, ఈ-మెయిల్స్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో చాటింగ్ చేయొచ్చు.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. వైఫైతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. దీని ద్వారా స్మార్ట్‌సిటీగా మారవచ్చునని భావిస్తున్నారు. లాగిన్ ఇలా.. ప్రస్తుత బీఎస్ఎన్ఎల్ సేవల తరహాలోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. అందుకు...స్మార్ట్ ఫోన్లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి.మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.వాటిని టైప్‌చేసి లాగిన్ కావాలి. ఇదీ వినియోగం.... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో బీఎఎస్ఎన్ఎల్ ద్వారా ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున వంద జీబీల డేటా వినియోగమవుతోంది. నెక్లెస్‌రోడ్డు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఈసేవలు వినియోగించుకుంటున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. నెక్లెస్ రోడ్లో సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వై-ఫై వినియోగమవుతుండగా, ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్లమేర ఉచిత వై-ఫై వినియోగించుకుంటున్నారు. కనిష్టంగా బిర్లా ప్లానెటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ ఆస్పత్రి వద్ద 580 సెషన్స్ మేర వై-ఫై సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం.