
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత షంషేర్ సింగ్ సుర్జేవాలా(87) కన్నుమూశారు. అనారోగ్యంతో గతకొంత కాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం మృతి చెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా తండ్రి అయిన షంషేర్ సింగ్.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆ రాష్ట్ర మంత్రిగా ఆయన సేవలు అందించారు. హర్యానా రైతు సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన షంషేర్ సుర్జేవాలా రైతుల హక్కుల కోసం పోరాటం చేశారు. ఇవాళ మధ్యాహ్నం హర్యానాలోని నర్వాణాలో షంషేర్ సుర్జేవాలా అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే ఆయన మృతి విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సుర్జేవాలా కుటుంబాన్ని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment