న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రానికి ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) ను కేటాయించే అంశంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యతో సహా పలువురు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేయడంతో కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారంతెలిపింది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎయిమ్స్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం పలు విద్యా సంస్థలు, రీసెర్చ్ సెంటర్లను ప్రధాన నగరాలైన కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలకు ఒక్కొక్కటి కేటాయించింది. అలాగే, విజయవాడలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ ను తమ కూడా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.