
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment