Port folio
-
షేపవుట్..? ఫొటోషూట్..
‘నాకో మంచి పోర్ట్ ఫోలియో చేసిపెట్టండి’ అంటూ అభ్యర్థిస్తూ ఫొటో గ్రాఫర్లను కలిసేవారిలో సాధారణంగా గ్లామర్ రంగంలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక యువతే ఎక్కువ.. అయితే ప్రపంచంలోని అందరి రూట్లనూ అన్ని సంప్రదాయాలనూ మార్చేసిన కరోనా దెబ్బకి ఇదీ మారిపోయింది. దీంతో ఇప్పటికే గ్లామర్ రంగంలో తమకంటూ ఒక ప్లేస్ ఉన్నవారు సైతం ఫిర్ ఏక్‌బార్ అంటూ ఫొటో షూట్స్ కోసం క్యూ కడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘అవకాశాలు రావడం మొదలయ్యాక సదరు అవకాశాలు ఇచ్చిన వారి కోసం పాత్రలకు అనుగుణంగా ఫొటో షూట్స్ గ్లామర్ రంగంలో సర్వసాధారణం. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి అప్‌కమింగ్ నటి/మోడల్ మళ్లీ తమని తాము మొదటి నుంచీ పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరోసారి పోర్ట్ ఫోలియో ప్లీజ్ అంటున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్వహిస్తున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల. ఒత్తిడితో అధిక బరువు.. ⇔ అనూహ్యంగా వచ్చిపడిన మహమ్మారి దెబ్బకు అందాల తారల రొటీన్ మొత్తం తలకిందులైంది. మొదట్లో ఇది ఒక రోజో, ఒక వారమో ఉండిపోయేది అనుకుని తేలిగ్గా తీసుకున్న కొందరు.. రోజులు, నెలల తరబడి లాక్డౌన్ కొనసాగడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ⇔ నాలుగ్గోడల మధ్య ఉండటమనే అలవాటు లేని వారు, కొత్తగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నవారు అంతలోనే ఈ దెబ్బ తగలడంతో ఒత్తిడికి లోనై, ఈటింగ్ డిజార్డర్‌కు గురై బరువు పెరిగిపోయారు. ⇔ యోగా వంటివి చేసినప్పటికీ జిమ్స్‌లో తప్పనిసరిగా చేయాల్సిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బాడీ టోనింగ్ వ్యాయామాలు చేయకపోవడంతో మరికొందరిలో ఆ మేరకు కండరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ‘రూపు’దిద్దుకోండి.. నగరంలో గ్లామర్ రంగం ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్, యాడ్ షూట్స్.. నిదానంగానే అయినా పుంజుకుంటున్నాయి. దీంతో తారలు మళ్లీ తమ ‘పాత్ర’లు పోషించడం కోసం సిద్ధమవుతున్నారు. ⇔ సిద్ధమవుతున్న వారు.. తమలో ఎలాంటి మార్పులూ రాలేదని రుజువు చేసుకోవాల్సిందిగా నిర్మాతలు, రూపకర్తల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. దీంతో వీరంతా.. జిమ్‌లలో కసరత్తుల టైమ్ పెంచడంతో పాటు సరికొత్త పోర్ట్ ఫోలియోలను రూపొందించమని ప్రముఖ ఫొటోగ్రాఫర్లను కలుస్తున్నారు. ⇔ విచిత్రం ఏమిటంటే.. తమను తాము పరిచయం చేసుకోవడానికి మంచి ఆల్బమ్ రూపొందించమని అడగాల్సిన ఔత్సాహికులు.. కోవిడ్ పుణ్యమాని ఇప్పుడు కొత్త అవకాశాలు దక్కించుకునే పరిస్థితి లేకపోవడం పోర్ట్ ఫోలియోలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ చిత్రమైన పరిస్థితులు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొలత.. కలత.. ⇔ నిత్యం తీసుకుంటున్న కార్బొహైడ్రేట్లను, కేలరీలను కొలుచుకుంటూ ఆ ప్రకారం ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని రోజువారీ పనుల్లో భాగంగా మార్చడం వగైరాలు గ్లామర్ రంగంలో పనిచేస్తున్న వారికి మరీ ముఖ్యంగా యువతులకు ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ⇔ రూపురేఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే రంగం కాబట్టి.. అవకాశాలు అందించడంలో ఫిజికల్ ఫిట్నెస్, మెజర్మెంట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అంగుళాలతో సహా లెక్కించుకుని, శరీరపు కొలతల్లో ఎటువంటి తీవ్రమైన మార్పు చేర్పులూ చోటు చేసుకోకుండా కేర్ తీసుకుంటారు గ్లామర్ తారలు. పోర్ట్‌ఫోలియో తప్పదు.. కొత్తగా అవకాశాలు అందుకోవాలనుకున్నవారు మాత్రమే కాదు లాక్డౌన్ తర్వాత అందరూ కొత్త తారలే అయ్యారు. ఫ్రెష్ ఫొటోషూట్ ద్వారా మాత్రమే వారు తమ లుక్ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత నేను చేసిన వర్క్స్‌లో తారల పోర్ట్ఫోలియోలే ఎక్కువగా ఉన్నాయి. – షరీఫ్ నంద్యాల, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ -
బదులు తీర్చుకున్న నితీశ్
పట్నా: కేంద్ర మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీపై బదులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించిన ఆయన.. ఎన్డీఏలోని బీజేపీ, ఎల్జేపీలను పక్కనబెట్టి కేవలం తమ పార్టీకే చెందిన 8 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈ పరిణామంపై ఎల్జేపీ నేత, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. ఎన్డీఏలో ఎటువంటి విభేదాల్లేవని, జేడీయూ తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వజూపగా వారు అయిష్టత వ్యక్తం చేశారని తెలిపారు. గతంలో ఖాళీ అయిన మంత్రి పదవులనే తాజా విస్తరణలో భర్తీ చేశామన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య ఎటువంటి విభేదాల్లేవని వెల్లడించారు. ఈ పరిణామంపై బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సీఎం నితీశ్ మా పార్టీకి ఒక మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ, మేం ప్రస్తుతానికి వద్దని చెప్పాం’ అని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ లాల్జీ టాండన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్ కేబినెట్లోని బీజేపీకి చెందిన ఇద్దరు, ఎల్జేపీకి చెందిన ఒకరు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నిక కావడం, ముజఫర్‌పూర్ షెల్టర్ హోం కేసులో ఆరోపణలున్న మంజు వర్మ రాజీనామాతో నాలుగు పోస్టులు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర కేబినెట్లో ఉన్న బీజేపీకి చెందిన రాజీవ్ రంజన్ సింగ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, దినేశ్ చంద్ర యాదవ్ జల్‌శక్తి శాఖ మంత్రిగా, ఎల్జేపీ నేత పసుపతి కుమార్ పరాస్ మత్స్యశాఖ మంత్రిగా ఇటీవల కేంద్ర మంత్రి వర్గంలో స్థానం పొందిన విషయం తెలిసిందే. నితీశే మా నేత: పాశ్వాన్ బిహార్‌లో ఎన్డీఏ ఐక్యంగా>నే ఉందని, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ నేత అని ఎల్జేపీ నేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్లో చేరకూడదన్న జేడీయూ నిర్ణయం ఎన్డీఏపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. ‘ఈ అంశంపై అపార్థాలు వెదకడం తగదు. ఎన్డీఏలోనే ఉన్నాం, ఉంటామంటూ నితీశ్ కుమార్ ఇప్పటికే చెప్పారు కూడా. విభేదాలు ఏవైనా ఉంటే నేను చూసుకుంటా’ అని అన్నారు. కేంద్ర కేబినెట్లో చేరేలా నితీశ్‌ను ఒప్పిస్తారా అని మీడియా ప్రశ్నించగా.. ‘సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఆయనకుంది. ఎన్డీఏలోనే ఉంటా మంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేసినప్పుడు ఇంకా సమస్యెందుకు? అని పాశ్వాన్ తిరిగి ప్రశ్నించారు. -
పరీకర్ మంత్రిత్వ శాఖల అప్పగింత?
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. -
నిశ్చింతగా రిటైర్ కావాలంటే..
జీతం మీదే ఆధారపడిన వారికి .. పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుం టాయి. రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుపడకూడదంటే .. కాస్త ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే సరి. పదవీ విరమణ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దిశగా తోడ్పడే కొన్ని అంశాలు మీకోసం.. వైద్యానికీ కొంత కేటాయించాలి .. రిటైర్మెంట్ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవ్యోల్బణం, మరొకటి వయసు పైబడుతున్న కొద్దీ పెరిగే వైద్యం ఖర్చులు. ఆసుపత్రి వ్యయాలు ఏటా 18-20% పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంత అవసరమో లెక్క వేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి.. సాధారణంగా 58-60 సంవత్సరాలకు రిటైరవుతుంటాం. అయితే, ఏదైనా కారణంతో ఒకవేళ 50 ఏళ్లకే రిటైరవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? అందుకే ఈ రెండు అంశాలకూ పనికొచ్చే విధంగా రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలుగా విడగొట్టాలి. ఒక భాగం సాధారణ రిటైర్మెంట్కి కేటాయించాలి. రెండోది ముందస్తు రిటైర్మెంట్ వయసు నుంచి సాధారణ పదవీ విరమణ వయసు దాకా (58-60) గడిపే సంవత్సరాల కోసం కేటాయించాలి. అత్యాశకు పోవద్దు.. సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధిక రాబడులు అందిస్తామనే మోసపూరిత పథకాల వలలో పడకుండా ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటే రిస్కు కూడా ఎక్కువే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మార్కెట్లంటే భయపడొద్దు .. రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది దీర్ఘకాలికమైనది. కనుక, సురక్షితంగా, స్థిరమైన రాబడులు ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి. అలాగని మరీ రక్షణాత్మకంగా కాకుండా పోర్ట్‌ఫోలియోలో అన్ని పథకాలు ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో మిగతా సాధనాల కన్నా అధిక రాబడులు అందిస్తుంటాయి. కనుక, ముందస్తుగా పదవీ విరమణ చేయదల్చుకున్న వారు రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన యులిప్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరింత పొదుపు చేయాలి.. తగినంత నిధితో రిటైర్ కావాలంటే.. సాధ్యమైనంత వరకూ వ్యయాలు తగ్గించుకోవాలి, పొదుపు చర్యలు పాటించాలి, తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. పన్నులపరంగా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తే.. మరింత డబ్బు పొదుపు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆదాయం పెంచుకోవాలి.. కాలం చాలా విలువైనది. కనుక దీన్ని వృథా చేయకుండా ఆదాయం తెచ్చిపెట్టే పనులపై ఇన్వెస్ట్ చేయాలి. కేవలం జీతమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కూడా అన్వేషించుకోవాలి. -
టర్మ్‌పాలసీ ఎంతకు తీసుకోవాలి..?
రానున్న పదిహేనేళ్లలో నెలకు రూ.30,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించాలనుకుంటున్నాను. కొన్ని ఫండ్స్‌ను ఎంపిక చేశాను. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరిలో బిర్లా సన్‌లైఫ్ టాప్ 100, ఎస్బీఐ బ్లూచిప్, యూటిఐ ఆపర్చునిటీస్ ఫండ్స్‌ను, మిడ్-అండ్-స్మాల్ క్యాప్ కేటగిరీల్లో మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్, ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్‌క్యాప్, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ ఎంపిక చేశాను. అయితే వీటిల్లో ఫైనల్‌గా ఏ ఫండ్స్‌ను ఎంచుకోవాలి, ఎంతెంత మొత్తం వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలో సూచించగలరు. ఇక నేను ఇప్పటికే బిర్లా సన్‌లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ, ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. - శశికళ, హైదరాబాద్ విస్తృతమైన కసరత్తు చేసి మీరు ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మీరు మంచి ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీర్ఘకాలానికైతే, ఈక్విటీల్లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులు పెద్దగా ప్రభావం చూపవు. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో చాలా బావుంది. దీంట్లో మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం లేదు. వీటిల్లో పెట్టుబడులను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. ప్రస్తుతమున్న ఈ 4 ఫండ్స్‌కు హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్ను జత చేయండి. దీంతో మీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 5 ఫండ్స్ ఉంటాయి. ప్రస్తుతం మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.30 వేలను కలుపుకొని, ఈ 5 ఫండ్స్‌లో సమానంగా ఇన్వెస్ట్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియో మంచి డైవర్సిఫికేషన్‌తో ఉన్నది. మంచి రాబడులనివ్వగలుగుతుంది. నేను 7-10 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇలైట్ మ్యాక్సి మిజర్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఫండ్స్‌ను షార్ట్ లిస్ట్ చేశాను. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందో సూచించండి. - జాన్సన్, గుంటూరు బీమా అనుసంధాన పాలసీలు మంచి రాబడులు ఇస్తున్నప్పటికీ, వాటి విషయంలో కొన్ని సమస్యలు ఇంకా తొలగిపోలేదు. మీరు దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ మీరు త్వరగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలని చూస్తే, జరిమానా చెల్లిం చాల్సి ఉంటుంది. మీ బీమా అవసరాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మీరు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మీకసలు బీమా అవసరమే ఉండదు. మీకు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత, మీపై ఆధారపడే వ్యక్తులు పెరిగి, ఆదాయం ఆర్జించే వ్యక్తిగా మీకు బీమా తప్పనిసరి అవుతుంది. ఇక మీరు ఎంపిక చేసిన పాలసీలు ఆ అవసరాలను తీర్చలేవు. ఏదైనా టెర్మ్ ప్లాన్‌ను ఎంచుకోండి, టెర్మ్ప్లాన్కు ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయం మీ టెర్మ్ కవర్‌గా ఉండాలి. హెచ్డీఎఫ్సీ టాప్ 200, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్ 100ల్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా యూటీఐ డివిడెండ్ ఈల్డ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేశాను. నా ఇన్వెస్ట్మెంట్స్ సరైన విధంగానే ఉన్నాయా? తగిన సూచనలివ్వండి? - సయ్యద్ సత్తార్, కొత్తగూడెం మీరు మంచి ఫండ్స్‌నే ఎంచుకున్నారు. ప్రస్తుతానికి ఈ ఫండ్స్ పనితీరు సంతృప్తికరంగా లేనప్పటికీ, నిరాశ చెందాల్సిన పని లేదు. భవిష్యత్తులో ఇవి మంచి పనితీరునే కనబరుస్తాయి. అయితే డీఎస్పీ బ్లాక్‌రాక్ టాప్100ను మినహాయించవచ్చు. మీ పోర్ట్‌ఫోలియో నుంచి ఈ ఫండ్‌ను తప్పించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పవచ్చు. ఇండెక్సేషన్ లెక్కించిన తర్వాత డెట్ ఫండ్స్ ద్వారా రూ.2 లక్షల క్యాపిటల్ గెయిన్స్ పొందాను. నేను ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది? - పాపారావు, విజయనగరం డెట్ ఫండ్స్ నుంచి వచ్చిన ఆదాయంపై పన్ను విషయమై స్పష్టమైన నిబంధనలున్నాయి. దీర్ఘకాలిక మూల ధన లాభాలపై పన్ను రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది వచ్చిన లాభాలపై పది శాతం ఫ్లాట్‌గా చెల్లించడం. ఇక రెండోది ఇండెక్సేషన్‌ను పరిగణనలోకి తీసుకొని 20 శాతం పన్ను చెల్లించడం. ఈ రెండు విధానాల్లో మీకు ఏది ప్రయోజనకరమనుకుంటే దానిని అనుసరించండి.