2019 నాటికి ‘ఎయిమ్స్’ పూర్తి
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక్మంగా మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)ను 2019 చివరినాటికి పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రకమిటీ సభ్యుడు, రాయపూర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నితిని నాగార్కార్ తెలిపారు.
* గ్లోబల్ టెండర్ల ఆహ్వానానికి చర్యలు
* మౌలిక వసతుల కల్పనపై నివేదిక
* కేంద్ర కమిటీ వెల్లడి
మంగళగిరి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక్మంగా మంగళగిరిలో నిర్మిస్తున్న ఎయిమ్స్(అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ)ను 2019 చివరినాటికి పూర్తి చేసి జాతికి అంకితం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రకమిటీ సభ్యుడు, రాయపూర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నితిని నాగార్కార్ తెలిపారు. మంగళగిరిలోని శానిటోరియం స్థలంలో ఎయిమ్స్ నిర్మాణ పనులను ఢిల్లీ ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ డీకె శర్మ, కేంద్ర ఆరోగ్య శాఖ పీఎంఎస్‌ఎస్‌వై yì విజన్ సభ్యుడు సుదీప్ శ్రీవాస్తవ, ఆరోగ్యశాఖ ఇంజినీరింగ్ నిపుణుడు కె.శర్మ, సీనియర్ ఆర్కిటెక్ రాజీవ్‌కనోజయాలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఎయిమ్స్ మ్యాప్‌ను పరిశీలించిన అనంతరం కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎయిమ్స్‌కుS వెళ్లేందుకు ప్రధానంగా మంగళగిరి పట్టణం గౌతమబుద్ధారోడ్ నుంచి జాతీయరహదారికి కనెక్టవిటీ రోడ్ 100 అడుగులు ఉండాలని, దీనికి అవసరమైన అటవీశాఖభూమి 13 ఎకరాలను వెంటనే డీరిజర్వ్ చేసి కేటాయించాలని ఆదేశించారు. అదే విధంగా నిర్మాణస్థలంలో వున్న విద్యుత్‌లైన్లు, హైటెన్షన్ పవర్‌లైన్లను వెంటనే మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. అన్నిశాఖల అధికారులతో సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎయిమ్స్ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో నిర్మాణాన్ని వేగంగా జరిగేలా చూస్తామన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఎయిమ్స్ నిర్మాణంలో కావాల్సిన మౌలిక వసతులు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌తో పాటు నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం ఇప్పటికే జరుగుతున్న ప్రహరీగోడ పనులను పరిశీలించిన బృందం పనులు మందకోడిగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వారికి వివరాలు అందించిన వారిలో అకడమిక్ డీఎంఈ బాబ్జి, జిల్లా అటవీశాఖ అధికారులు మోహనరావు, వెంకటేశ్వరావు, రవికుమార్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, ఆర్డీవో శ్రీనివాసరావు, సిద్ధార్థ కళాశాల ప్రిన్స్‌పల్ ఆర్ శంశాంక్, తహశీల్దార్ సంగా విజయలక్ష్మి, విద్యుత్ ఏడీఈ రాజేష్‌ఖన్నా, ఏఈ భాస్కరరావు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఉన్నారు.