ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి.
అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి.
ఎయిమ్స్‌లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.
#WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services
— ANI (@ANI) January 4, 2024
(Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ
Comments
Please login to add a commentAdd a comment