
మోడీకి ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు
ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ఢిల్లీ ఎయిమ్స్‌లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు మోడీ ఎయిమ్స్‌కు చేరుకోగా.. ఆయనకు వైద్యులు పరీక్షలు చేశారు.
సాధారణంగా ప్రధానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటీన్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, అందులో భాగంగానే మోడీకి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.