రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, తనిఖీ జాబితా (చెక్‌లిస్ట్) పంపడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. రెండు మూడు ప్రాంతాలను గుర్తించి అక్కడున్న మౌలిక సదుపాయాలు, అవకాశాలపై నివేదిక ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరగా ఆ సమాచారం పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.