బీబీనగర్ ఎయిమ్స్ ఖ్యాతిని ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. వైద్య, విద్య పరిశోధన విభాగాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18 వైద్య కళాశాలల డైరెక్టర్లు,ఎంపీలతో కమిటీ వే శారు. అలాగే ఫైనాన్స్, హెచ్‌ఆర్, అకడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీ నికి సంబంధించి ఎయిమ్స్ డైరెక్టర్ ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
బీబీనగర్ (భువనగిరి) : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రం రంగాపురం పరిధిలో గల ఎయిమ్స్ కళాశాల రూపురేఖలను మార్చేందు కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిమ్స్ కళా శాల నిర్మాణంతో పాటు ఓపీ సేవలకు బీజం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ని మ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చి కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. క ళాశాలలో ఒకవైపు ఎంబీబీఎస్ తరగతులు కొనసాగుతున్నాయి. మొదటి విడతలో 50విద్యార్థులు వి ద్యను అభ్యసిస్తున్నారు. ఓపీ సేవలను అందిస్తున్నా రు. కోవిడ్ కారణంగా ఎయిమ్స్ అధికారులు టెలీకన్సల్టింగ్ ఓపీ సేవలను అందుబాటులో ఉంచారు.
ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా
ఎయిమ్స్ కళాశాలను ప్రపంచ ఖ్యాతి స్థాయి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా రూప కల్పన చేసేందుకు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దీంతో వైద్య, విద్య పరిశోధన విభా గాలను ఏర్పాటు చేసేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 18మంది వైద్య కళాశాలలకు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన డైరెక్టర్లతో, ఎంపీలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఫైనాన్స్, హెచ్‌ఆర్, ఆకాడమిక్, సెలక్ట్ స్టాండింగ్ కమిటీలను ఎర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఎయిమ్స్ ప్రఖ్యాతి చెందేలా ఐఐటీ సంస్థలతో భాగస్వామ్యంతో ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్‌గా మరింత అభివద్దికి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అక్టోబర్ నాటికి వసతుల ఏర్పాటుకు చర్యలు
2020 అక్టోబర్ నాటికి ఎయిమ్స్‌లో పూర్తిస్థాయిలో నియామకాలతోపాటు వసతులు ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నియామకాలకు సంబంధించి 143పోస్టులకు ప్రకటన వేయగా ఇందులో ఫ్యాకల్టీతోపాటు నాన్‌టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మరిన్ని పోస్టులను జారీ చేయనున్న ట్లు సమాచారం. టీచింగ్ ఫ్యాకల్టీ కోసం ఇప్పటికే రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కళాశాలకు 161 ఎకరాల భూదాన్ భూమిని కేటాయించగా మరింత భూమి అవసరం కావడంతో 89 ఎకరా ల పట్టా భూములను సేకరించారు. కన్‌స్ట్రక్షన్ ఎజెన్సీ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యా రు.
త్వరలో నిర్మాణాలు
నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మారుస్తూ కేంద్రం గెజిటెడ్ విడుదల చేయడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా భూమి సిద్ధంగా ఉండడంతో త్వరలో కళాశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. నిమ్స్ భవనంలో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తుండగా మూడేళ్లలో పూర్తిస్థాయిలో 240ఎకరాలకు పైగా స్థలంలో వసతి గహాలు, ప్రొఫెసర్లు, వైద్యుల గృహాలు, పరిశోధన కేంద్రాలు నిర్మించనున్నారు. అలాగే మైదానాలు, స్విమ్మింగ్‌పూల్స్, బృందావనాలు, రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం.
కమిటీలో ముగ్గురు ఎంపీలు
ఎయిమ్స్‌ను ప్రపంచ ఖ్యాతి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చేందుకు వేసిన 18మంది డైరెక్టర్ల కమిటీలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు బండ ప్రకాశ్, బండి సంజయ్, అరవిందులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్
డైరెక్టర్ వికాస్ భాటియా, ఎంపీ, ఎయిమ్స్ అడ్వయిజర్ సభ్యులు బండ ప్రకాశ్‌లు గురువారం ఇనిస్టిట్యూట్ కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు, ఈ సందర్భంగా దేశ నలుమూలల నుంచి 17మంది సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రధానంగా ఎయిమ్స్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని, 2021లోపు ఎయిమ్స్ రూపు రేఖలను మార్చనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment