
న్యూఢిల్లీ: ఒక వ్యక్తి రెండేళ్ల కొడుకుని మూడు అంతస్తుల బాల్కనీ నుంచి తోసేసి తాను దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలోని కల్కాజీ వద్ద ఉన్న స్లమ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన తండ్రి కొడుకులిదర్నీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్)కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మన్‌సింగ్ అతడి భార్య పూజా కుటంబ కలహలతో గత కొన్ని నెలలుగా వేర్వేరుగా నివశిస్తున్నారు.
ప్రస్తుతం పూజ తన ఇద్దరు పిల్లలతో కల్కాజీలో ఉంటున్న తన నానమ్మ వద్దే ఉంటోంది. గత రాత్రి మన్‌సింగ్ తన భార్య పూజ వద్దకు వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో మన్‌సింగ్ కోపంతో.. తన రెండేళ్ల కొడుకుని 21 అడుగుల ఎత్తులో ఉన్న బాల్కనీ నుంచి పడేసి..ఆ తర్వాత అతను దూకేశాడు. ఈ మేరకు పోలీసులు మనసింగ్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడు ఆ సమయంలో తాగి ఉన్నాడని పూజ నానమ్మ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment