రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలోని మణియన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న అధికారి నరేష్ చంద్ర శర్మ కుమారుడు హృదయాంశ్(22 నెలలు) అరుదైన జన్యుపరమైన వ్యాధి ఎస్‌ఎంఏ టైప్-2తో బాధపడుతున్నాడు. హృదయాంశ్ తన కాళ్లపై తాను నిలబడలేడు. చికిత్స లో భాగంగా ఆ చిన్నారికి రూ. 17.5 కోట్ల విలువైన ZOLGESMA ఇంజక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు.
హృదయాంశ్‌కు రెండు నెలల వ్యవధిలోగా ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంత స్వల్ప వ్యవధిలో రూ. 17 కోట్ల భారీ మొత్తాన్ని ఏర్పాటు చేయడం హృదయాంశ్ తండ్రి నరేష్ చంద్రకు సాధ్యంకాని పని. ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ యూఆర్ సాహు దీనిపై పలువురు పోలీసు సూపరింటెండెంట్‌లకు నరేష్ చంద్ర శర్మకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఈ మెయిల్ చేశారు.
తన కుమారుని వైద్యం కోసం అవసరమయ్యే సొమ్ము భారీగా ఉండటంతో సామాజిక సంస్థలు, సంఘాలు కూడా ముందుకువచ్చి సహాయం అందించాలని పోలీసు అధికారి నరేష్ చంద్ర శర్మ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment