రూ. 2 కోట్లకు ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌ పరీక్షా పత్రాలు! | Rajasthan Police Recruitment Exam Paper Leak Case | Sakshi
Sakshi News home page

Rajasthan: రూ. 2 కోట్లకు ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్‌ పరీక్షా పత్రాలు!

Published Wed, Mar 6 2024 12:59 PM | Last Updated on Wed, Mar 6 2024 1:13 PM

Rajasthan Police Recruitment Exam Paper Leak Case - Sakshi

రాజస్థాన్‌లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ‍ప్రభుత్వం ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.

ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. 

ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్‌లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement