ఉత్తరకాశీ టన్నెల్ నుండి సురక్షితంగా బయటకు వచ్చిన 41 మంది కార్మికులను ప్రభుత్వం ఆర్మీకి చెందిన హెలికాప్టర్‌లో రిషికేశ్ ఎయిమ్స్‌కు తరలించింది. ఈ కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు, మానసిక పరీక్షలు చేసిన తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు.
ఎయిమ్స్‌కు కార్మికులు చేరుకోకముందే ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎయిమ్స్ హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే, ఆరోగ్య కార్యకర్తలు.. కార్మికులను ఆరోగ్య పరీక్షల కోసం అంబులెన్స్‌లు, వీల్‌చైర్ల ద్వారా వారిని వార్డులకు తీసుకు వెళ్లారు.
వైద్యుల బృందం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. సొరంగం నుండి బయటపడిన కార్మికులంతా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే వారి ఆరోగ్యం గురించి మరింతగా తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను పరీక్ష కోసం తీసుకుంటున్నట్లు వైద్యుల బృందం తెలిపింది. కార్మికుల మానసిక పరిస్థితిని పరిశీలించేందుకు సైకియాట్రిస్ట్ బృందం కూడా సేవలను అందిస్తోంది.
ఇది కూడా చదవండి: కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు
Comments
Please login to add a commentAdd a comment