న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) నిర్వహించిన ఎంబీబీఎస్ ఆన్‌లైన్ ప్రవేశపరీక్షలో ప్రశ్నపత్రం లీక్ కాలేదని విచారణ కమిటీ తెలిపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు అక్కడి అధికారుల సాయంతో మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. ప్రశ్నపత్రం స్క్రీన్ షాట్స్ బయటకు రావడంపై సీబీఐ విచారణ జరపాలని కోరినట్లు కమిటీ పేర్కొంది. పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల ఫలితాలు ్చజీజీఝట్ఛ్ఠ్చఝట.ౌటజతోపాటు మిగతా ఆరు ఎయిమ్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.